Mura Movie Trailer Out: ‘క్రాష్ కోర్స్’, ‘ముంబైకర్’, ‘థగ్స్’ లాంటి వైవిధ్యభరిత సినిమాల్లో నటించి ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హ్రిదు హరూన్, విలక్షణ నటుడు సూరజ్ వెంజారముడు ప్రధాన పాత్రల్లో రూపొందిన రియల్ రా యాక్షన్ ఫిల్మ్ ‘ముర’. ‘కప్పేల’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహ్మద్ ముస్తఫా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవంబర్ 8న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్.. ‘మురా’ మూవీ మలయాళ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఆకట్టుకుంటున్న ‘ముర’ ట్రైలర్
‘ముర’ సినిమా వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని తెరకెక్కించినట్లు మేకర్స్ వెల్లడించారు. సాఫీగా సాగిపోతున్న నలుగురు టీనేజ్ కుర్రాళ్ల జీవితం..ఓ వ్యక్తి కారణంగా అనుకోని మలుపులు తీసుకుంటుంది. ఆ తర్వాత వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరకు వాటిని నుంచి ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ‘ముర’ ట్రైలర్ ప్రేక్షకులకు చాలా ఎంగేజింగ్ గా కనిపిస్తోంది. కేరళ, త్రివేండ్రంలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. రియలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ వెల్లడించారు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సరికొత్త ఉద్వేగానికి గురవుతాడని చెప్పారు.
యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ‘ముర’ సాంగ్స్
మలయాళంలో రూపొందిన ‘ముర’ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ అందుకుంటున్నాయి. కేరళ యూత్ ను ఈ మూవీ సాంగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజా ట్రైలర్ లో హ్రిదు హరూన్, సూరస్ వెంజారుముడు వెర్సటైల్ యాక్టింగ్, ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో మాలా పార్వతి, కని కుస్రుతి, కన్నన్ నాయర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫాజిల్ నజీర్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి క్రిస్టి జోబి మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రియా శిబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ బాబు కథను రాయగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రోనీ జకారియా వ్యవహరిస్తున్నారు. ఫాజిల్ నజీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటర్ చమన్ చక్కో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ను పి.సి.స్టంట్స్ రూపొందించాయి. మేకప్ ఆర్టిస్టుగా రోనెక్స్ గ్జెవియర్ వ్యవహరించారు. కాస్ట్యూమ్స్ డిజైనర్ గా నిసార్ రహ్మత్ పని చేశారు. పి.ఆర్.ఓలుగా నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) వ్యవహరిస్తున్నారు.
Read Also: రివ్యూ రైటర్లకు శ్రీకాంత్ అయ్యంగార్ సారీ చెప్పారా? లేదంటే మీ పని చెబుతా అని బెదిరిస్తున్నారా?
Read Also: ప్రభాస్ స్వీట్ హార్ట్, మెగాస్టార్ వెరీ స్పెషల్, తెలుగు హీరోల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్