అక్కినేని శత జయంతి సంవత్సరంలో ఆయన పేరు మీద ఇచ్చే ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు (ANR National Award 2024) తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలియజేయడమే కాదు... ఆ వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు 17 ఏళ్ల క్రితం జరిగిన వివాదాన్ని మళ్లీ తెరపైకు తీసుకు వచ్చాయి. ఇప్పుడు నాగార్జున చేసిన ట్వీట్ సైతం చిరుకు మద్దతుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ నాగార్జున ఏం ట్వీట్ చేశారు?


చిరంజీవి లివింగ్ లెజెండ్... నాగార్జున ట్వీట్!
అక్కినేని శత జయంతి సంబరాలను (ANR Centenary Celebrations), ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు వేడుకను ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా, ఓ మధురమైన అనుభూతిగా మార్చినందుకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిలకు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్లో వాళ్ళిద్దరినీ లివింగ్ లెజెండ్స్ అని కింగ్ పేర్కొన్నారు.


Also Read: చైతన్య, శోభిత మీదే అందరి కళ్లు... ఆల్రెడీ అక్కినేని కోడలు హోదా, అదీ పెళ్ళికి ముందు!






తెలుగు చలనచిత్ర సీమ నిర్వహించిన వజ్రోత్సవాల్లో చిరంజీవిని 'లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా' పురస్కారంతో సత్కరించాలని ఆ సమయంలో టాలీవుడ్ పెద్దలు కొందరు భావించారు. అయితే, తను లెజెండ్ కాదా అని మోహన్ బాబు ప్రశ్నించడం ఆ తర్వాత తనకు ఇచ్చిన అవార్డును క్యాప్సూల్ బాక్స్ లో చిరంజీవి పడేయడం తెలిసిన విషయాలు. దానిని ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు వేడుకలో చిరు ప్రస్తావించారు. అప్పట్లో మోహన్ బాబు ఏం మాట్లాడారు? ఆ వివాదం మీద ఇప్పుడు చిరంజీవి ఏ విధంగా స్పందించారు? అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. అప్పటి విషయాలు గుర్తున కొందరు ప్రేక్షకులు వాటిని గుర్తు చేసుకుంటుండగా... తెలియని వారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తున్నారు. 


Also Readమెగాస్టార్ చిరంజీవికి ఏయన్నార్ నేషనల్ అవార్డు - సందడి చేసిన స్టార్స్ ఎవరో చూశారా?






ఈ తరుణంలో చిరంజీవిని లివింగ్ లెజెండ్ అంటూ నాగార్జున పేర్కొనడం... మోహన్ బాబు మాట్లాడిన మాటలకు చిరంజీవి స్పందిస్తే, ఇప్పుడు చిరంజీవి లెజెండ్ అని నాగార్జున కన్ఫర్మ్ చేశారని పరిశ్రమలోని కొందరు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ప్రేక్షకుల మధ్యలో కూడా ఇది చర్చనీయాంశం అవుతుంది.



తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జీవితం మీద ఆస్కార్ పురస్కార గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రూపొందించిన ఆడియో వీడియో ప్రజెంటేషన్ ఎప్పటికీ తమకు గుర్తుంటుందని నాగార్జున చెప్పారు. కీరవాణికి కృతజ్ఞతలు తెలిపారు.