ABP Impact: బుల్లెట్ బైక్‌లే టార్గెట్‌గా రెచ్చిపోతున్న దొంగలు- ఏబీపీ స్టోరీతో పోలీసుల యాక్షన్
ఏబీపీ దేశం ఎఫెక్ట్, బుల్లెట్ బైక్ లే టార్గెట్ గా చోరీలు కథనానికి స్పందన. బైక్ దొంగల గుట్టు రట్టు చేసిన పోలీసులు. రూ.70 లక్షలు విలువ చేసే 40 బైక్ లు రికవరీ.
ఈ నెల 4వ తేదీన బుల్లెట్ బైక్ లే టార్గెట్ గా చోరీలు అని ఏబీపీ దేశం ఇచ్చిన కథనం ఎఫెక్ట్ చూపింది. పోలీసులు సీరియస్ గా తీసుకుని కేసును ఛేదించారు. దీంతో బైక్ చోరీల ముఠా గుట్టు రట్టైంది. ఇటీవల నిజామాబాద్ నగరంలో తరచూ టూ విల్లర్స్ చోరీలకు గురవుతున్నాయి. ఏబీపీ దేశం ఇచ్చిన కథనానికి స్పందించారు పోలీసులు. బైక్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు సిరియస్ గా తీసుకున్నారు. తీగ లాగితే బైక్ దొంగల డొంక కదిలింది. బైక్‌లు పోయాయంటూ వివిధ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో 36 కేసులు నమోదయ్యాయ్.
నిజామాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే విలువైన బీఎస్ 6, బీఎస్ 4 బైకులను దొంగిలించి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మీడియా ఎదుట నిందితులను హజరుపరిచి ఈ ముఠా ఆగడాలను సీపీ నాగరాజు వెళ్లడించారు. మీడియా సమావేశంలో సీపీ నాగరాజు మాట్లాడుతూ.... నిజామాబాద్ నగరంలోని హష్మీ కాలనీకి చెందిన సమదుద్దీన్, మహ్మదీయ కాలనీకి చెందిన షేక్ రియాజ్ ఇద్దరు డ్రైవర్ లుగా పనిచేస్తూ నగరంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జల్సాలకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం బైక్ ల చోరీలకు పాల్పడ్డారు.
నగరంలో కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన బుల్లెట్ బైక్ లు, యాక్టివా వాహనాలను టెక్నిక్ తో సైకిల్ పూల్లలను ఉపయోగించి తాళాలను సులువుగా తెరిచి బైక్ లను చోరీ చేస్తున్నారు. బాన్సువాడ పట్టణం తాడ్ కోల్ కు చెందిన టూ వీలర్ ఫైనాన్స్ వ్యాపారి, హైదరాబాద్ శాస్త్రిపురం కాలనీకి చెందిన అద్నాన్ బిన్ ఉమర్ తో కలిసి దొంగిలించిన టూ విల్లర్ బైక్ లను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో, కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో అమ్ముతున్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. బాన్సువాడ పట్టణంలో తాడ్ కోల్ లో వచ్చిన సొమ్ముతో ఇల్లు కూడా నిర్మించుకున్నారని సీపీ తెలిపారు.
ఇటీవల పోలీసు శాఖపై బైకుల చోరీ విషయంలో వచ్చిన ఒత్తిళ్లతో డీసీపీ అరవింద్ బాబు పర్యవేక్షణలో, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, 2వ టౌన్ ఎస్ఐ పూర్ణేశ్వర్, సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా పాత నేరస్తులైన షేక్ సమీదుద్దీన్, షేక్ రియాజ్ ను అదుపులోకి తీసుకొని 11 రాయల్ ఎన్ ఫీల్డ్, 18 యాక్టివా బైక్ లు, 8 పల్సర్ లు, 8 షైన్, 3 బార్గ్ మ్యాన్ బైక్ లను రికవరీ చేశారు. ఈ కేసును చేదించి రూ. 72 లక్షల విలువైన బైక్ లను రికవరీ చేశారు. ఈ టాస్క్ లో పాల్గొన్న పోలీసులకు సీపీ నాగరాజు క్యాష్ రివార్డులు, ప్రశంస పత్రాలను ఇచ్చారు.