అన్వేషించండి

Gangula Kamalakar : మౌనంగా గంగుల కమలాకర్ - పార్టీ మారడానికి గ్రీన్ సిగ్నల్ రాలేదా ?

Karimnagar : గంగుల కమలాకర్ రాజకీయపయనంపై ఎలాంటి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ లో ఎంట్రీకి పొన్నం ప్రభాకర్ అడ్డు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

Gangula Kamalakar is unable to decide on his political career : మాజీ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేత గంగుల కమలాకర్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు.  తన మార్క్ పాలిటిక్స్ తో హల్ చల్ చేసే ఆ సీనియర్ లీడర్  గప్‌చుప్‌గా ఉంటున్నారు. కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన పార్టీ మారే ఆలోచనలో కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న పాత పరిచయాలు  కాంగ్రెస్ వైపు లాగుతున్నాయి. ఇలా గందరగోళంగా ఉండటంతో ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు.  

బీసీ వర్గాల్లో పట్టున్న గంగుల కమలాకర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి జిల్లాలో బలమైన బీసీ నేత గంగుల  కేసీఆర్ , కేటీఆర్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  గంగుల ఆ ఇద్దరికి నమ్మిన బంటుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పారు.    ఏ పని అప్పగించిన దాన్ని విజయవంతం చేయడానికి కష్టపడి పని చేస్తారని చెబుతుంటారు.  గంగుల ప్రస్తుతం పార్టీ అధినాయకత్వానికి అంటి ముట్టనట్టు గా వ్యవహరిస్తున్నారు.  జిల్లాలో పార్టీతో పెద్దగా సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు.  

ఎమ్మెల్యే పార్టీ  వీడినా విమర్శలకు దూరం                               

ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ వీడినా స్పందించకుండా సైలెంట్ గానే ఉన్నారు గంగుల. మిగతా నేతలంతా విమర్శలు గుప్పించారు.  హాట్ హాట్ కామెంట్లు చేసే  గంగుల ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.  వాస్తవానికి గంగుల పార్టీ మారుతారని చాలా రోజుల క్రితమే ఊహాగానాలు మొదలయ్యాయి. నెక్స్ట్ గంగులే అంటూ దాదాపు నెల రోజులుగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. ఈ ప్రచారాలను ఆయన ఖండించలేదు. కొద్ది రోజుల కిందట అధినేత కేసీఆర్ ను  కలిసిన గంగుల ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.  ఆయన పేరు అలా ప్రచారంలో ఉండగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ లో  చేరుతున్నారు.

ప్రభుత్వంపై విమర్శలకు దూరం

టిఆర్ఎస్ ముఖ్య నాయకులు అంతా ప్రభుత్వంపై ఏదో రూపంలో పోరాడుతుంటే గంగుల మాత్రం నోరు  తెరవడం లేదు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో గంగులకు ఉన్న పరిచయాలే కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి గంగుల టిడిపిలో టీడీపీ లో కలిసి పనిచేశారు.  అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ కారణంగా సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారాలు ఉన్నాయి. అయితే ఆయన కాంగ్రెస్ లో కూడా చేరలేకపోతున్నారు. పొన్నం ప్రభాకర్ తో ఆయనకు సరైన సంబంధాలు లేకపోవడంతో  చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget