అన్వేషించండి

Telangana సింగరేణి విషయంపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు: బోయినపల్లి వినోద్ కుమార్

PM Modi Speech in Ramagundam: సింగరేణి అంశంపై, తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగరేణి సంస్థ అంశంపై, తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 13న పార్లమెంటు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. తెలంగాణలోని కోల్ బ్లాకులను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నామని స్పష్టంగా చెప్పారు. అయితే తెలంగాణలో ఉన్న ఈ కోల్ బ్లాకులను తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారని ఈ సందర్భంగా వినోద్ కుమార్ తెలిపారు.

ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో చెప్పింది అబద్ధమా..?
ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ రామగుండం సభలో చెప్పింది నిజమా..? అన్న విషయం తేలాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు అని వినోద్ కుమార్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. సింగరేణి విషయంపై నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు. పార్లమెంట్ సభలో గత డిసెంబర్ 13న కోల్ బ్లాకులను విక్రయిస్తున్నామని అందుకు బహిరంగ టెండర్లు పిలిచారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మీ సమక్షంలో చెప్పింది నిజమా, లేక రామగుండం సభలో ప్రధానమంత్రి హోదాలో మీరు చెప్పింది నిజమా స్పష్టం చేయాలని వినోద్ కుమార్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోల్ బ్లాకులను తమకే ఇవ్వాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది వాస్తవం కాదా అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. కళ్యాణ ఖని బ్లాక్ - 6, కోయగూడెం బ్లాక్ -lll, సత్తుపల్లి బ్లాక్ -lll, పల్లి శ్రావణ్ పల్లి కోల్ బ్లాకులను విక్రయించేందుకు బహిరంగ టెండర్ పిలిచింది వాస్తవం కాదా అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని ఆయన నిలదీశారు. రామగుండ ఎరువుల కర్మాగారాన్ని జాతీయం చేసిన ప్రధాని మోదీ అనంతరం పాల్గొన్న సభలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సంస్కారం కాదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రామగుండం సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు తప్ప అందులో ఏమాత్రం నిజం లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం కోల్ మైన్స్ బ్లాక్ లోను బహిరంగ టెండర్ ద్వారా విక్రయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని నిండు పార్లమెంట్ సభలో మీ సమక్షంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పింది వాస్తవం కాదా కావాలనుకుంటే పార్లమెంటు రికార్డ్స్ లో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రధాని మోదీకి ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచించారు.

నోటికి వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసి ప్రజలకు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం నరేంద్ర మోదీ చేయడం ప్రధాన మంత్రి హోదాకు సరితూగదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ లో సింగరేణి విషయంపై జవాబు ఇచ్చారని, ఈ అంశం పార్లమెంటు రికార్డ్స్ లో ఉందని వినోద్ కుమార్ వివరించారు. ఇకనైనా అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలంటూ కేంద్రం పెద్దలకు సలహా ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
CM Revanth Reddy US Visit: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget