Breaking News Live Updates: ఏపీ ఎన్నికల సంఘం సీఈఓగా ముఖేష్ కుమార్ మీనా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
ఏపీ ఎన్నికల సంఘం సీఈఓగా ముఖేష్ కుమార్ మీనా

ఏపీ ఎన్నికల సంఘం సీఈఓగా ముఖేష్ కుమార్ మీనా నియమితులయ్యారు. ముఖేష్ కుమార్ మీనాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 

CM Jagan Konaseema Tour: కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

మత్స్యకారుల కష్టాలను పాదయాత్రలో దగ్గరగా చూశానని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని అన్నారు. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేదని.. ఇవాళ అర్హులు అందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారని జగన్ గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి 50 వేల మందికి పరిహారం ఇచ్చారని అన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు అయితే, ఇప్పుడు తమ ప్రభుత్వం ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.

JC Prabhakar Reddy: సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఉద్రిక్తత

* జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకునేందుకు తెలుగుదేశం నేతలు సన్నద్ధం.
* జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు
* మరికొద్దిసేపట్లో కొత్త చెరువుకి రానున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
* కొత్త చెరువులో మోహరించిన పోలీసులు
* Ujwal Foundationలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించేందుకు వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

SI Suicide: సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సర్పవరం ఎస్సై ఆత్మహత్య

* సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సర్పవరం ఎస్సై ఆత్మహత్య

* కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోపాల కృష్ణ ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య

* సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న సర్పవరం ఎస్సై

* ఎస్సై స్వగ్రామం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట

* నిన్న కోనసీమలోని సీఎం బందోబస్తు ఏర్పాట్లకి వెళ్ళి వచ్చిన ఎస్సై గోపాలకృష్ణ

* ఆత్మహత్యకు పాల్పడ్డ ఎస్సై 2014 సంవత్సరం బ్యాచ్

* ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఒక గదిలో ఇద్దరు పిల్లలు భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య

Nizamabad Medical Student Death: నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో పీజీ విద్యార్థి అనుమానాస్పద మృతి

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గైనకాలజీ వార్డులో డ్యూటీ చేస్తున్న స్టూడెంట్ శ్వేత వాష్ రూమ్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లారు. శ్వేత బెడ్‌పై మృతిచెందినట్లు విద్యార్థులు గుర్తించారు. కరీంనగర్ కు చెందిన శ్వేత ప్రస్తుతం గైనకాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతోంది. నిన్న రాత్రి రెండు గంటల వరకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో శ్వేత డ్యూటీ చేసింది. మూడు గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న విశ్రాంతి గదిలోకి వెళ్లి పడుకుంది. ఉదయం తోటి సిబ్బంది చూసే సరికి శ్వేత మృతిచెంది కనిపించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Background

Asani Cyclone Effect Latest News: అసని తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, వాయుగుండంగా, ఇప్పుడు అల్ప పీడనంగా మారింది. ఇది సంబధిత తుపాను ప్రసరణ మధ్య - ట్రోపోస్పిరిక్ స్థాయుల వరకూ విస్తరించినట్లుగా హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో మత్స్యకారులకు సైతం అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. 

ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. సాధారణ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములు, జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. 

Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
అసని తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై అంతగా లేదు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నేడు స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట, రంగారెడ్డి, వనపర్తి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మే 15 నాటికి దక్షిణ అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు 2022 మే 15 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

‘‘అసని తుపాను కథ ఇక ముగిసింది, మళ్లీ ఎండలు, ఉరుములతో కూడిన వర్షాలు మొదలౌతాయి. మళ్లీ సాధారణ స్ధితికి రేపటి నుంచి వాతావరణం ఉండనుంది. ఎన్నో మలుపులు తిరిగిన అసానీ తుఫాను, అసలు మానవమాత్రులకు చెప్పడం సాధ్యం కాని విషయం. వెయ్యి మందికి పైగా పని చేస్తున్న వాతావరణ శాఖకైనా ఈ తుపాను ఒక సవాలే.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ రాసుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే బాగా పెరిగింది. పది గ్రాములకు రూ.490పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 పెరిగింది. 

బంగారం, వెండి ధరలు

తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,200గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,490గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.60,800 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.60,400 గా ఉంది.

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్‌టీ! ఇక ఆ సేవలు ఖరీదే

28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్‌టీ! ఇక ఆ సేవలు ఖరీదే

Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?

Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్

Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు

Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు