Breaking News Live: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం... చిన్నారి సహా ఐదుగురు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 Dec 2021 03:26 PM
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం... చిన్నారి సహా ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. 

కోంపల్లికి రోశయ్య పార్థివ దేహం

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య భౌతిక కాయాన్ని గాంధీ భవన్‌ నుంచి కోంపల్లికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఆయన కోంపల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తొలుత అమీర్ పేట్‌లో రోశయ్య ఇంటి నుంచి భౌతిక కాయాన్ని గాంధీ భవన్‌కు తీసుకొచ్చారు. అక్కడ కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సమయంలోనే సోనియా గాంధీ దూతగా వచ్చిన మల్లికార్జున ఖర్గే కూడా భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని కోంపల్లికి తరలించారు.

రోశయ్యకు బండి సంజయ్ నివాళి

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాజకీయలు ఉన్నంత కాలం రోశయ్య జీవించి ఉంటారని అన్నారు. ఆర్థిక మంత్రి అంటే మెదట గుర్తొచేది రోశయ్యేబనని అన్నారు. ఆయన అవినీతి మరకలేని వ్యక్తి అని, నిజాయతీ పరుడని బండి సంజయ్ కొనియాడారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి బండి సంజయ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రోశయ్యకు ఏపీ నేతల నివాళులు

మాజీ సీఎం రోశయ్య పార్థివ దేహానికి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, సినీనటుడు చిరంజీవి నివాళులు అర్పించారు. రోశయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరుకానున్నారు. రోశయ్య భౌతిక కాయాన్ని ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌కు తీసుకెళ్లనున్నారు.

మధ్యాహ్నం రోశయ్య అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనున్నాయి. కోంపల్లిలోని ఆయన పాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం నుంచి రోశయ్య భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, బండి సంజయ్ సహా మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు హాజరై నివాళి అర్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని, వెల్లంపల్లి శ్రీనివాస్ రోశయ్య అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

Background

నాగాలాండ్‌లో దారుణం
నాగాలాండ్‌ రాష్ట్రంలో భారీ తప్పిదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు అనే అనుమానంతో భద్రతా సిబ్బంది సొంత పౌరులను కాల్చారు. ఈ ఘటనలో చాలా మంది ప్రజలు మరణించారు. దీంతో స్థానికులు ఆగ్రహించి.. కాల్పులకు కారణమైన భద్రత జవాన్ల వాహనాలను తగలబెట్టారు. నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా ఓటింగ్‌లో ఈ ఘటన జరగ్గా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు ఎగబాకింది. వెండి ధరలో మాత్రం గ్రాముకు రూ.0.20 పైసలు తగ్గి.. కిలోకు రూ.200 మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,820 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,500గా ఉంది. విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,820గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,820గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.


పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నేడు ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.107.69 అయింది. డీజిల్ ధర రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరుకు రూ.0.20 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.71 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.19 పైసలు తగ్గి రూ.96.77గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.


వాతావరణ వివరాలు
అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం శనివారం తుపానుగా మారింది. డిసెంబరు 2న బలపడి వాయుగుండంగా మారి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. జవాద్ తుపాను దిశను మార్చుకోవడంతో ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో.. గోపాల్‌పూర్‌కు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పూరికి దక్షిణ నైరుతిగా 390 కిలోమీటర్ల దూరంలో నేటి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 


Also Read: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆ విషయంలో కేంద్రం మీనమేషాలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి


Also Read: వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.