What Indians ordered on New Year 2025 | న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ 2025 సంవత్సరానికి ఆహ్వానం పలికాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారత్‌లో ఏ వస్తువుల ఎక్కువగా ఆర్డర్ చేశారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కొందరు ఫుడ్ ఆర్డరిస్తే, కొందరు డ్రింక్స్ పెడుతుంటారు. డిసెంబర్ 31న భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఐటమ్స వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు బ్లింకిట్, స్విగ్గీ, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ షేర్ చేశాయి. 


నూతన సంవత్సర వేడుకల సందర్భంగా Blinkit CEO అల్బిందర్ ధిండ్సా, స్విగ్గీ, Swiggy Instamart సహ వ్యవస్థాపకుడు ఏ ఫణి కిషన్ తమ ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధికంగా ఆర్డర్ చేసిన, అత్యంత ప్రజాదరణ పొందిన వస్తువుల వివరాలను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. 






భారతీయులు ఎక్కువగా ఏం ఆర్డర్ చేసారంటే..
ఊహించినట్లగానే కొత్త సంవత్సరంలో పార్టీలు బాగా జరిగాయి. దేశవ్యాప్తంగా ప్రజలు స్నాక్స్‌ ఎక్కువ బుక్ చేసుకున్నారుు. రాత్రి 8 గంటల వరకే బ్లింకిట్‌లో 2.3 లక్షల ఆలూ భుజియా ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో సైతం గత రాత్రి 7.30 గంటలకే నిమిషానికి 853 చిప్స్ ఆర్డర్‌లు వచ్చాయి. 


స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) లో అత్యధిక బుకింగ్స్ పాలు, చిప్స్, చాక్లెట్, ద్రాక్ష, పన్నీర్ ఐటమ్స్ ఉన్నాయని వెల్లడించింది. కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్ కూడా భారీగా ఆర్డర్ చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకే బ్లింకిట్ ద్వారా డెలివరీ 6,834 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, అదే సమయానికి బిగ్ బాస్కెట్‌లో ఐస్ క్యూబ్‌ల ఆర్డర్‌లు 1290 శాతం పెరిగాయి. 7:41 గంటల సమయంలో 119 కిలోలు ఐస్ క్యూబ్స్ డెలివరీ అయ్యాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ ట్వీట్ చేశారు.






బిగ్‌బాస్కెట్‌లో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ విక్రయాలు 552 శాతం పెరిగాయి. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్‌ల ఆర్డర్స్ సైతం 325 శాతం పెరిగాయి. సోడా, మాక్‌టెయిల్ విక్రయాలు సైతం 200 శాతం పెరిగాయి.


అమాతం పెరిగిన కండోమ్ విక్రయాలు
న్యూ ఇయర్ సందర్భంగా అత్యధిక విక్రయాలు జరిగిన మరో ఐటమ్ కండోమ్స్. డిసెంబర్ 31 మధ్యాహ్నం వరకే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 4,779 ప్యాక్‌ల కండోమ్స్ డెలివరీ చేసింది. సాయంత్రం తరువాత నిరోధ్‌ల విక్రయాలు మరింత పెరిగాయి. బ్లింకిట్‌లో సైతం కండోమ్ అమ్మకాలు భారీగా పెరిగాయని Blinkit CEO అల్బిందర్ ధిండ్సా తెలిపారు. రాత్రి 9.50 గంటల సమయానికి 1.2 లక్షల కండోమ్‌ల ప్యాకెట్లు డెలివరీ చేశామని వెల్లడించారు.






నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కస్టమర్ కళ్లకు గంతలు కట్టి, చేతికి సంకెళ్లు కావాలని ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ట్వీట్ చేసింది. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేనంతగా కూల్ డ్రింక్స్, చిప్స్ విక్రయాలు పెరిగాయంటే ఎక్కువగా ఇంట్లో కుటుంబసభ్యులతో న్యూ ఇయర్ జరుపుకున్నారని ఈకామర్స్ దిగ్గజాలు చెబుతున్నారు. లో దుస్తులు సైతం కొందరు ఆర్డర్ పెట్టడం విశేషం.


Also Read: LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు