Tips to Follow for First Flight Journey : రోడ్ జర్నీ, ట్రైన్ జర్నీని కొందరు రెగ్యులర్‌గా చేస్తారు. కానీ ఎన్ని ఏళ్లు గడిచినా.. విమాన ప్రయాణం చేయనివారు కూడా ఉంటారు. అలాంటివారు మొదటిసారి ఫ్లైట్ జర్నీ చేయాల్సి వస్తే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. కొన్ని బేసిక్స్ ఫాలో అయితే మీరు విమాన ప్రయాణం చేసేప్పుడు ఎలాంటి భయం ఉండదు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం, ప్రయాణం కోసం సిద్ధం కావడం నుంచి బోర్డింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
జర్నీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు ప్రయాణిస్తున్న విమానం డిటైల్స్‌ను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. అలాగే మీ బోర్డింగ్ పాస్ని ప్రింట్ తీసుకోవడం లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ప్రింట్ తీసుకుంటే మరీ మంచిది. ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్, విసా(అవసరమైతే) కచ్చితంగా తీసుకుని వెళ్లాలి. బ్యాగేజ్ పాలసీ ప్రకారం మీ లగేజ్‌ని ప్యాక్ చేసుకోవాలి. ప్రయాణానికి కంఫర్టబుల్, లేయరింగ్ పద్ధతిలో డ్రెస్‌లు వేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది.
ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేందుకు..
మీరు విమాన ప్రయాణం చేసేప్పుడు కచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌కి మీ ఫ్లైట్ జర్నీ మొదలయ్యే 2 గంటల ముందే చేరుకోవాలి. కౌంటర్లో చెక్ ఇన్ అవ్వాలి. సెక్యూరిటీ చెక్, స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాగేజ్‌ని డ్రాప్ ఆఫ్ చేసుకోవాలి.
బోర్డింగ్
మీ బోర్డింగ్ పాస్‌ను గేట్ ఏజెంట్‌కు సబ్మీట్ చేయాలి. అప్పుడు వారు ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిస్తారు. జర్నీకోసం మీకు ఎంపికైన సీట్లోకి వెళ్లి కూర్చోవడమే. ఫ్లైట్‌లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. వాటర్‌ని తాగి హైడ్రేటెడ్‌గా ఉంటే మంచిది. స్నాక్స్ వంటివి తినొచ్చు. మ్యూజిక్ వినండి.
ల్యాండింగ్ తర్వాత..
విమానం పూర్తిగా ఆగిన తర్వాత లేచి దిగి వెళ్లండి. మీ బ్యాగేజ్‌ని క్లైమ్ చేసుకోండి. తర్వాత ప్రయాణానికి ట్యాక్సి లేదా ఇతర వాహన సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు.
టేకాఫ్ సమయంలో..
ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న సమయంలో కొందరు టెన్షన్‌తో ఇబ్బంది పడుతుంటారు. గుండెలో దడ వంటి భయం ఉండొచ్చు. అలాంటి వారు వీలైనంత రిలాక్స్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. మొదటిసారి ప్రయాణించాలనుకున్నప్పుడు ఎక్కువ సమయం ఉండేవి కాకుండా గంట, రెండు గంటల జర్నీ ఉండే విమాన ప్రయాణం చేయాలి. అప్పుడు ఫ్లైట్ అలవాటు అవుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినా.. తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మరిన్ని టిప్స్
మొదటిసారి ఫ్లైట్ జర్నీ చేసేప్పుడు.. కాస్త ఒత్తిడిగానే ఉంటుంది. కానీ కామ్‌గా, ప్రశాంతంగా ఉంటే స్ట్రెస్ ఉండదు. ఫ్లైట్స్ కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కంగారు పడకపోవడం మంచిది. విమానంలో నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే జర్నీ మీకు పెద్దగా కష్టమనిపించదు.
ఈ సింపుల్, బేసిక్ టిప్స్ ఫాలో అయితే మీరు ఫ్లైట్ జర్నీ చేయాలంటే పెద్దగా ఇబ్బంది పడరు. ముఖ్యంగా జర్నీకి రెండు గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటే ప్రశాంతంగా జర్నీని ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకపోవడమే మంచిది.