Best and Beautiful Beaches in India for Trip : న్యూ ఇయర్​ 2025లో మీరు ట్రిప్స్​కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? మీకు బీచ్​లంటే బాగా ఇష్టమా? అయితే ఈ సంవత్సరం మీరు వెళ్లాల్సిన లిస్ట్ ఇక్కడుంది. ఇండియాలో అత్యంత అందమైన బీచ్​లు ఎక్కడున్నాయో ఇక్కడ లిస్ట్ ఉంది. వాటిని ఎలా ఎక్స్​ప్లోర్ చేయాలో తెలుసుకుని.. మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.  


పలోలెం బీచ్ (Palolem Beach)


బీచ్​ అంటే చాలామందికి గుర్తొచ్చేది గోవానే. అయితే దక్షిణ గోవాలోని పలోలెం బీచ్​ అందమైన బీచ్​లలో ఒకటి. చుట్టూ ఎత్తైన కొబ్బరి చెట్లతో నిండి ఈ బీచ్​ టూరిస్టులకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. స్విమ్మింగ్ చేయడానికి, నైట్​ లైఫ్​కి ఈ బీచ్​ బెస్ట్​ అనే చెప్పవచ్చు. 


అగోండా బీచ్​ (Agonda Beach)


నార్త్​ గోవాలోని అగోండా బీచ్​ కూడా ఇండియాలోని బ్యూటీఫుల్ బీచ్​లలో ఒకటి. నార్త్​ గోవాల్లోని ఇతర బీచ్​లతో పోలిస్తే ఇది మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ బీచ్​లు ఈత కొట్టడానికి అనువైనది. డాల్ఫిన్లను కూడా చూడొచ్చు. ప్రశాంతతను కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 


వర్కలా బీచ్ (Varkala Beach)


కేరళలోని వర్కల బీచ్ ఇండియాలోని​ అందమైన బీచ్​లలో ఒకటి. ఆకట్టుకునే అరేబియా సముద్రం, బ్యూటీఫుల్ లొకేషన్లు, కొబ్బరి చెట్లతో నిండిన ఈ బీచ్ మీకు బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. లోకల్ షాప్​లు, కేఫ్​లను కూడా విజిట్ చేయవచ్చు. ఔషధ గుణాలను కలిగి ఉన్న సహజ నీటి బుగ్గలు కూడా ఇక్కడ ఉన్నాయి. 


మరారి బీచ్, కోవలం బీచ్ (Marari Beach,Kovalam Beach)


కేరళలోని మరారి బీచ్​ కూడా మీకు అద్భుతమైన ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడి వాతావరణం మీ మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. విశ్రాంతి కోసం ఎదురుచూసేవారికి ఇది బెస్ట్ ప్లేస్. అలాగే ఆయుర్వేద చికిత్సలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కేరళలోని కోవలం బీచ్ కూడా అందమైన బీచ్​లలో ఒకటి. సన్​బాత్, స్విమ్మింగ్, సర్ఫింగ్, పారాసైలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్​కు ఇది అనువైనది. 


టర్కర్లీ బీచ్ (Tarkarli Beach)


మహారాష్ట్రలోని టర్కర్లీ బీచ్​ క్లీన్ వాటర్​, సముద్రజీవులకు అనువైన బీచ్​గా ప్రసిద్ధి చెందింది. వాటర్ స్పోర్ట్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. కర్లీ నది బ్యాక్ వాటర్స్​తో ఆకట్టుకుంటుంది. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, బోటింగ్​లను ఇక్కడ మీరు ఎక్స్​పీరియన్స్ చేయవచ్చు. 


రాధానగర్ బీచ్ (Radhanagar Beach)


అండమాన్ నికోబార్ దీవుల్లోని స్వరాజ్ ద్వీప్ దగ్గర రాధానగర్ బీచ్​ ఉంది. ఇది ఇండియాలోని అందమైన బీచ్​ల లిస్ట్​లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బీచ్​ ఆసియాలోని అత్యుత్తమ బీచ్​లలో ఒకటిగా చెప్తారు. ఇక్కడ వాటర్ చాలా ప్యూర్​గా ఉంటుంది. నీటికింద ఉండే ఇసుక కూడా బాగా కనిపిస్తుంది. సన్​ సెట్, సన్ రైజ్​ సమయంలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. 


నీల్ ఐలాండ్ బీచ్​లు(Neil Island Beaches)


అండమాన్, నికోబార్ దీవుల్లోని నీల్ ఐలాండ్​లోని బీచ్​లు బ్యూటీఫుల్ బీచ్​లకు నిలయంగా చెప్తారు. భరత్​పూర్, లక్ష్మణ్​పూర్, సీతాపూర్ బీచ్​లు అత్యంత అందమైన బీచ్​లగా పేరు తెచ్చుకున్నాయి. ఇక్కడ రంగురంగుల పగడపు దిబ్బలు, ఇసుక తెన్నెలు బాగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ బీచ్​లలో నడుస్తూ.. సూర్యాస్తమయాలను ఎంజాయ్ చేయవచ్చు.



ఈ అందమైన బీచ్​లను న్యూ ఇయర్ 2025లో మీరు కూడా ఎక్స్​పీరియన్స్ చేయండి. ఫ్రెండ్స్​తో, ఫ్యామిలీతో, సోలోగా వెళ్లాలనుకునేవారికి కూడా ఇవన్నీ మంచి అనుభూతిని ఇస్తాయి. 


Also Read : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా