Hari Hara Veera Mallu Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను తెరపై చూడడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు న్యూ ఇయర్ సర్ప్రైజ్ ఇచ్చేశారు 'హరిహర వీరమల్లు మేకర్స్. గత ఏడాదంతా పవన్ సినిమా రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్ కి కొత్త ఏడాది కొత్త కబురుతో గుడ్ న్యూస్ అందించారు. ఈ మేరకు న్యూ ఇయర్ రోజున 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ స్పెషల్ పోస్టర్ ను వదిలారు.
పవన్ పాడిన 'మాట వినాలి'... రిలీజ్ ఎప్పుడంటే?
న్యూ ఇయర్ సందర్భంగా 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అది కూడా జనవరి 1న కరెక్ట్ గా 12 గంటలకు ఈ సాంగ్ ను విడుదల చేయబోతున్నారని అన్నారు. ఈ పాటను స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడారని ప్రచారం జరగడంతో, అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా 'హరిహర వీరమల్లు' టీం సాంగ్ పై అప్డేట్ ఇచ్చింది. "సెలబ్రేట్ దిస్ న్యూ ఇయర్ విత్ అవర్ ఫస్ట్ సింగిల్ మాట వినాలి" అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ ఇచ్చింది. కానీ న్యూ ఇయర్స్ సందర్భంగా కేవలం ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు. పాట రిలీజ్ అవుతుందని ఎదురు చూసిన వాళ్లకు ఇది కాస్త నిరాశను కలిగించే విషయం. తాజా పోస్టర్ లో 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి మొదటి పాట 'మాట వినాలి' తెలుగులో జనవరి 6న ఉదయం 9:06 గంటలకు రిలీజ్ కాబోతోంది. ఇక ఆ పోస్టర్ లో ఉన్న మరో సర్ప్రైజ్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పాటను పాడినట్టు అఫీషియల్ గా మేకర్స్ వెల్లడించారు.
ఇంకా షూటింగ్ పెండింగ్ లోనే...
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎక్కువగా సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కుదిరినప్పుడు సినిమాలకు కూడా డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "డేట్స్ ఇచ్చినా కూడా నిర్మాతలే వాడుకోలేదు" అని అన్నారు. అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. మరో ఎనిమిది రోజులు టైం కేటాయిస్తే 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి ఆ ఎనిమిది రోజులు పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో చూడాలి.
Also Read: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న సినిమా 'హరిహర వీరమల్లు'. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కు 'హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పేరును ఫిక్స్ చేశారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీని 2025 మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక చెప్పినట్టుగానే ఈ సినిమాను 2025 మార్చ్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు మరోసారి పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?