అన్వేషించండి
Shane Warne Death: బంతిని మెలితిప్పిన నువ్వు మా గుండెల్ని ఎందుకిలా మెలిపెడుతున్నావ్! బ్రేక్ చేయలేని Shane Warne రికార్డులివీ!
Shane Warne Death News : ఆటను తన స్పిన్‌తో మలుపు తిప్పిన స్పిన్నర్ Shane Warne. తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్ల వికెట్లు ఎగరగొట్టిన లెక్కలేనన్ని రికార్డులు సృష్టించాడు.
![Shane Warne Death: బంతిని మెలితిప్పిన నువ్వు మా గుండెల్ని ఎందుకిలా మెలిపెడుతున్నావ్! బ్రేక్ చేయలేని Shane Warne రికార్డులివీ! Shane Warne Death News Know Shane Warne profile biography stats records unknown facts in photos Shane Warne Death: బంతిని మెలితిప్పిన నువ్వు మా గుండెల్ని ఎందుకిలా మెలిపెడుతున్నావ్! బ్రేక్ చేయలేని Shane Warne రికార్డులివీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/04/6dbfcb8fdb26277b5fd8d46f7bd0c5c2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shane-warne @twitter
Shane Warne profile biography stats records: క్రికెట్ ఎప్పుడూ బ్యాటింగ్ సెంట్రిక్ గేమే! ఎప్పుడూ వారిదే పైచేయి! ఆటను చూసే అభిమానులకూ బ్యాటర్లంటేనే ఇష్టం! అలాంటి గేమ్‌ను తన స్పిన్‌తో ఒక్కసారిగా మలుపు తిప్పిన స్పిన్నర్ షేన్ వార్న్। Shane Warne. సాధారణంగా బౌన్స్, స్వింగ్ అయ్యే పిచ్‌లపై బంతిని డ్రిఫ్ట్ చేయడం, గింగిరాలు తిప్పడం కష్టమని చాలామంది ఫీలింగ్. అలాంటి విదేశీ వికెట్లపైనా తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్ల వికెట్లు ఎగరగొట్టిన ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. అతనిప్పుడు లేడని తెలిసి క్రికెట్ ప్రపంచం మూగబోయింది. అతడి రికార్డులను తలచుకుంటోంది.
- షేన్ వార్న్। Shane Warne మొత్తంగా 145 టెస్టులు ఆడాడు. 25.41 సగటుతో 708 వికెట్లు తీశాడు. ఇక 194 వన్డేల్లో 25.73 సగటుతో 293 వికెట్లు పడగొట్టాడు. 73 టీ20ల్లో 26.61 సగటుతో 70 వికెట్లు తీసిన ఘనత అతడి సొంతం. సుదీర్ఘ ఫార్మాట్లో 48సార్లు 4 వికెట్లు, 37సార్లు 5 వికెట్లు, 10సార్లు 10 వికెట్లు పడగొట్టాడు.
- చాలామంది షేన్ వార్న్। Shane Warneను బౌలర్‌గానే చూస్తారు. నిజానికి అతడు బ్యాటుతో విలువైన పరుగులు చేశాడు. టెస్టుల్లో 3154, వన్డేల్లో 1018, టీ20ల్లో 210 పరుగులు సాధించాడు.
- అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న మూడో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 17 సార్లు అందుకున్నాడు.
- టెస్టుల్లో సెంచరీ కొట్టకుండా అత్యధిక పరుగులు చేసిన ఏకైక ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 3015 పరుగులు చేశాడు.
- టెస్టు మ్యాచుల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఐదో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 34 సార్లు అయ్యాడు.
- ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఏకైక ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 96 పడగొట్టాడు.
- టెస్టుల్లో అత్యధిక సార్లు పది వికెట్ల ఘనత అందుకున్న రెండో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. పదిసార్లు తీశాడు.
- టెస్టు చరిత్రలో అత్యధిక బంతులు విసిరిన మూడో బౌలర్ షేన్ వార్న్। Shane Warne. మొత్తం 40705 బంతులు వేశాడు.
- టెస్టుల్లో అత్యంత వేగంగా 700 వికెట్లు తీసిన రెండో బౌలర్ షేన్ వార్న్। Shane Warne. 144 మ్యాచుల్లో తీశాడు.
- టెస్టుల్లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన మొదటి ఆటగాడు షేన్ వార్న్। Shane Warne.
- టెస్టుల్లో 1000 పరుగులు, 50 వికెట్లు, 50 క్యాచుల రికార్డు షేన్ వార్న్। Shane Warne పేరుతోనే ఉంది.
- వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 62 తీశాడు.
- వన్డేల్లో వరుసగా మూడుసార్లు నాలుగు వికెట్లు తీసిన మొదటి ఆటగాడు షేన్ వార్న్। Shane Warne.
- వన్డేల్లో కూడా 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన రికార్డు షేన్ వార్న్। Shane Warne పేరుతో ఉంది.
- వన్డేల్లో 1000 పరుగులు, 50 వికెట్లు, 50 క్యాచులు అందుకున్న రికార్డూ షేన్ వార్న్। Shane Warne పేరుతోనే ఉంది.
- మొత్తంగా క్రికెట్ కెరీర్లో సెంచరీ లేకుండా 4172 పరుగులు చేసిన తొలి ఆటగాడుషేన్ వార్న్। Shane Warne.
- మూడు ఫార్మాట్లలో కలిసి అత్యధిక సార్లు డకౌట్ అయిన తొమ్మిదో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 44 సార్లు అయ్యాడు.
- క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 1001 వికెట్లు పడగొట్టాడు.
- మొత్తంగా క్రికెట్ కెరీర్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 38 సార్లు ఈ ఫీట్ చేశాడు.
- క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. ఏకంగా 25,536 పరుగులు ఇచ్చాడు.
- స్టంపింగ్ రూపంలో అత్యధిక వికెట్లు దక్కించుకున్న రెండో ఆటగాడు షేన్ వార్న్। Shane Warne. 86 సార్లు ఇలా ఔట్ చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion