News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

Khelo India: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు.

FOLLOW US: 
Share:

Khelo India, Osmania University: 

ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. తిరుగులేని విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఓయూ ఇప్పటికే రెండుసార్లు బంగారు పతకాలు సాధించడం గమనార్హం.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీలు జరుగుతున్నాయి. బీబీడీ యూనివర్సిటీలోని ఏకనా టెన్నిస్‌  కోర్టులో జరిగిన సెమీ ఫైనల్లో యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ను 2-1 తేడాతో ఉస్మానియా యూనివర్సిటీ ఓడించింది. మొదట జరిగిన సింగిల్స్‌లో అదితి అరె (ఓయూ) 6-1, 6-0 తేడాతో రితికా (మద్రాస్‌)ను వరుస సెట్లలో ఓడించింది. అయితే మరో సింగిల్స్‌లో ఓమ్నా యాదవ్‌ (ఓయూ) 6-0, 6-1 తేడాతో అనన్య (మద్రాస్‌) చేతిలో ఓటమి చవిచూసింది.

 ఇక కీలకమైన మహిళల డబుల్స్‌లో ఉస్మానియా దుమ్మురేపింది. అదితి, ఓమ్నా 6-2, 7-6 (7-1) తేడాతో సాయి దివా, అనన్య (మద్రాస్‌) జోడీని ఓడించారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ఓయూ అమ్మాయిలు ట్రై బేకర్‌లో గెలిచారు. ఈ మ్యాచులో అదితి తన పవర్‌ గేమ్‌ను ప్రదర్శించింది. కోర్టు మొత్తం తిరుగులూ బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడింది. ఇద్దరూ కలిసి మంచి స్ట్రోక్‌ప్లేతో అలరించారు. ఖేలో ఇండియా మహిళల టెన్నిస్‌ పోటీల్లో తమ విద్యార్థులు వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరుకోవడం సంతోషంగా ఉందని ఓయూ కోచ్‌, మేనేజర్‌ ఫరూఖ్‌ కమాల్‌ అన్నారు.

Published at : 30 May 2023 12:29 PM (IST) Tags: Osmania University Khelo India University games Tennis team

ఇవి కూడా చూడండి

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: రోహిత్‌ మెరుపు సిక్సర్లు! కోహ్లీ హాఫ్‌ సెంచరీ - టార్గెట్‌ దిశగా టీమ్‌ఇండియా!

IND vs AUS 3rd ODI: రోహిత్‌ మెరుపు సిక్సర్లు! కోహ్లీ హాఫ్‌ సెంచరీ - టార్గెట్‌ దిశగా టీమ్‌ఇండియా!

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది