MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ - కోల్‌కతాకు గెలుపు తప్పనిసరి - ఏకంగా ఐదు మార్పులు చేసిన రైడర్స్!
ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్లో సోమవారం రాత్రి జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. గాయంలో ఐపీఎల్ 2022 మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ దూరం అయ్యాడు. ఇది ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ. ఆడిన 10 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. ఈ మ్యాచ్‌లో వారు ఎంత తేడాతో గెలుస్తారనే బట్టి పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ తుదిజట్టులో ఏకంగా ఐదు మార్పులు చేసింది. అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, ప్యాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు కాబట్టి తన స్థానంలో రమణ్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు.
ముంబై ఇండియన్స్ తుదిజట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రైలే మెరెడిత్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), టిమ్ సౌతీ, ప్యాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి
View this post on Instagram