Harshal Patel Sister Death: హర్షల్ పటేల్‌కు విషాదం! ముంబయితో మ్యాచ్ జరుగుతుండగా సోదరి మృతి
Harshal Patel Sister Death: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ హర్షల్ పటేల్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడి సోదరి మరణించారు.
Harshal Patel Sister Death: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ హర్షల్ పటేల్(Harshal Patel) కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడి సోదరి మరణించారు. విషయం తెలియడంతో హర్షల్ పటేల్ ఐపీఎల్ బయో బుడగను వీడాడు.
ఆర్‌సీబీకి హర్షల్ పటేల్ కీలక ఆటగాడిగా ఎదిగాడు. కొన్ని సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్లోనూ జట్టుకు తన బౌలింగ్‌తో విజయాలు అందిస్తున్నాడు. పవర్‌ప్లే తర్వాత వచ్చి పరుగుల్ని నియంత్రిస్తూ వికెట్లు తీయడం అతడి ప్రత్యేకత. అంతేకాకుండా బంతులు, వేగంలో వైవిధ్యం చూపిస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. శనివారం ముంబయితో జరిగిన మ్యాచులోనూ అతడే రెండు వికెట్లు తీయడంతో బెంగళూరు రేసులోకి వచ్చింది.
మ్యాచ్ జరుగుతుండగానే కుటుంబంలో జరిగిన విషాదం గురించి తెలియడంతో హర్షల్ పటేల్ బయో బుడగను వీడాడు. పుణె నుంచి ముంబయికి బయల్దేరిన జట్టు బస్సులో ఎక్కలేదు. అక్కడ్నుంచే నేరుగా స్వస్థలానికి వెళ్లాడు. 'దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించడంతో హర్షల్ బయో బుడగను వీడాల్సి వచ్చింది. అతడి సోదరి మరణించారు. పుణె నుంచి ముంబయికి బయల్దేరిని జట్టు బస్సు అతడు ఎక్కలేదు. ఏప్రిల్ 12న సీఎస్‌కేతో జరిగే మ్యాచుకు ముందే అతడు మళ్లీ బుడగలోకి ప్రవేశిస్తాడు' అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
Mandatory @HarshalPatel23 appreciation post. 🤩👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #MIvRCB pic.twitter.com/mVB7nXmeNW
— Royal Challengers Bangalore (@RCBTweets) April 9, 2022
Explosive start 💥
— IndianPremierLeague (@IPL) April 10, 2022
Opening with @faf1307 👌
Chatting post-game with the legendary @sachin_rt 🤩@AnujRawat_1755 & @mdsirajofficial sum up @RCBTweets' third win in a row. 👏 👏 - By @Moulinparikh
Full interview 📹 🔽 #TATAIPL | #RCBvMI https://t.co/l8jrQzV2UX pic.twitter.com/tCim8qMBn2