KKR vs DC Live Updates: రాణా గెలిపించేశాడు! దిల్లీపై 3 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం
కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 41వ మ్యాచ్లో తలపడుతున్నాయి. ప్లేప్లేఆఫ్స్‌కు చేరుకున్న దిల్లీని ఓడించి టాప్-4లో నిలవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ పట్టుదలతో ఉంది.
LIVE
Background
యూఏఈలో ఇప్పటివరకు కోల్‌కతా మంచి ప్రదర్శనే చేసింది. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో చతికిలపడటంలో కోల్‌కతా కొద్ది తేడాలో ఓటమి పాలైంది. టాప్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి మంచి ఫాంలో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి, ప్రసీద్ కృష్ణ, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్ పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు కూడా తీయగలుగుతున్నారు. ఆల్ రౌండర్ రసెల్ కూడా జట్టులో కీలకమైన ఆటగాడు.
ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఢిల్లీ బరిలోకి దిగింది. మార్కస్ స్టాయినిస్ స్థానంలో లలిత్ యాదవ్ బరిలోకి దిగాడు. ఢిల్లీ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో తిరుగు లేకుండా దూసుకుపోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి తమ టాప్ ప్లేస్ అందుకోవాలనేది ఢిల్లీ లక్ష్యం.
తుది జట్లు(అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసీద్ కృష్ణ
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, ఆన్రిచ్ నోర్జే, అవేష్ ఖాన్
రాణా గెలిపించేశాడు! దిల్లీపై 3 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం
దిల్లీపై కోల్‌కతా విజయం సాధించింది. ఆన్రిచ్ నార్జ్ వేసిన 18.2 బంతికి నితీశ్ రాణా (36*) బౌండరీ బాది గెలుపు బావుటా ఎగరేశాడు. 128 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 7 వికెట్లు నష్టపోయి మరో పది బంతులు ఉండగానే గెలిచింది.
18 ఓవర్లకు కోల్‌కతా 126-7
అవేశ్ ఖాన్ నాలుగు పరుగులిచ్చి టిమ్ సౌథీ (3)ని ఔట్ చేశాడు. రాణా (32)పై ఒత్తిడి పెరుగుతోంది. ఆ జట్టుకు 12 బంతుల్లో 2 పరుగులు కావాలి.
17 ఓవర్లకు కోల్‌కతా 122-6
నార్జ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి సునిల్ నరైన్ ఔటయ్యాడు. నితీశ్ రాణా (31), టిమ్ సౌథీ (0) క్రీజులో ఉన్నారు.
నితీశ్ రాణా (31; 22 బంతుల్లో)
సునిల్ నరైన్ (20; 6 బంతుల్లో )
16 ఓవర్లకు కోల్‌కతా 119-5
రబాడా ఈ ఓవర్లో ఏకంగా 21 పరుగులు ఇచ్చాడు. సునిల్ నరైన్ వరుసగా సిక్స్, బౌండరీ, సిక్స్ బాదేశాడు. రాణా అతడికి తోడుగా ఉన్నాడు. కోల్‌కతా విజయానికి 24 బంతుల్లో 9 పరుగులే అవసరం.
నితీశ్ రాణా (31; 22 బంతుల్లో)
సునిల్ నరైన్ (20; 6 బంతుల్లో )
15 ఓవర్లకు కోల్‌కతా 98-5
అవేశ్ ఖాన్ రెండు పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. రాణాపై భారం పెరిగింది. సునిల్ నరైన్ క్రీజులోకి వచ్చాడు.
నితీశ్ రాణా (30; 20 బంతుల్లో)
సునిల్ నరైన్ (1; 1 బంతుల్లో )