By: ABP Desam | Updated at : 04 Jan 2022 12:54 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్ vs దక్షిణాఫ్రికా
వాండరర్స్ టెస్టులో దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం లభించొచ్చని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. 15-20 పరుగుల ఆధిక్యం వస్తుండొచ్చని అంచనా వేశాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి కలిసి 7-8 వికెట్లు తీస్తారని ధీమా వ్యక్తం చేశాడు. రెండో టెస్టు రెండో రోజు ఆటపై తన అంచనాలు వివరించాడు. యూట్యూబ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు.
తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 202 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ (46: 50 బంతుల్లో, 6x4) అత్యంత విలువైన పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (11 బ్యాటింగ్: 57 బంతుల్లో, ఒక ఫోర్), కీగన్ పీటర్సన్ (14 బ్యాటింగ్: 39 బంతుల్లో, రెండు ఫోర్లు) బ్యాటింగ్ చేస్తున్నారు.
'టీమ్‌ఇండియా ప్రత్యర్థికి ఆధిక్యం ఇస్తుందనే అనిపిస్తోంది. భారత్ 202 పరుగులైతే చేసింది. ప్రత్యర్థి జట్టూ వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. బహుశా సఫారీ జట్టు 15-25 పరుగుల ఆధిక్యం సాధిస్తుండొచ్చు. షమి, బుమ్రా కలిసి 7 అంతకన్నా ఎక్కువ వికెట్లు తీస్తారు. ఇప్పటికే షమి ఒక వికెట్ తీశాడు. సిరాజ్ గాయపడ్డాడు. అతడి గాయం మరీ తీవ్రమైంది కావొద్దని ఆశిస్తున్నా. మధ్యలోనే వెళ్లిపోవడంతో అతడి ఓవర్‌ను శార్దూల్ పూర్తి చేశాడు' అని ఆకాశ్ అన్నాడు.
'నా మరో అంచనా ఏంటంటే దక్షిణాఫ్రికా ఆలౌట్ అవుతుంది. పిచ్‌లో వేగం ఉంది కాబట్టి మ్యాచ్ వేగంగా సాగుతుంది. ఇలాంటి పిచ్‌లపై స్కోరింగ్ రేట్ తక్కువగా ఉండదు. మ్యాచ్ సాగే కొద్దీ వికెట్లు పడతాయి. పరుగులూ వస్తాయి. వీటి మధ్యలోనే ఏదైనా అద్భుతం జరగాలని నేను కోరుకుంటున్నా' అని చోప్రా పేర్కొన్నాడు. అతడు ప్రతి రోజు మ్యాచుకు సంబంధించి తన అభిప్రాయాలు చెబుతున్నాడు.
IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్ అంటూ పొగడ్త
IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?
Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్