IND Vs NZ First Semi-Final Score Updates: వరల్డ్ కప్ ఫైనల్ చేరిన టీమిండియా, కివీస్ పై 70 రన్స్ తేడాతో ఘన విజయం

IND Vs NZ First Semi Final In World Cup 2023: టీమిండియా, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్‌ లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 15 Nov 2023 10:49 PM
పేసర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్

కీలకమైన నాకౌట్ మ్యాచ్ లో పేసర్ మహ్మద్ షమీ భారత బౌలింగ్ ను నడిపించాడు. మ్యాచ్ చేజారిపోతుందనిపించగా షమీ వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. 9.5 ఓవర్లలో 57 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీసిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. షమీ దెబ్బకు 398 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ 327 పరుగులకే ఆలౌటైంది. దాంతో 2019 వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

వరల్డ్ కప్ ఫైనల్ చేరిన టీమిండియా, కివీస్ పై 70 రన్స్ తేడాతో ఘన విజయం

టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో కివీస్ పై రోహిత్ సేన 70 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.


న్యూజిలాండ్ టార్గెట్ 398 పరుగులు కాగా, 48.5 ఓవర్లలో 327 పరుగులకే కివీస్ ఆలౌటైంది.  1983, 2003, 2011 తరువాత మరోసారి భారత క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది.

8వ వికెట్ కోల్పోయిన కివీస్, శాంట్నర్ ఔట్

సిరాజ్ వేసిన 48వ ఓవర్లో శాంట్నర్ ఔటయ్యాడు. రోహిత్ క్యాచ్ పట్టడంతో శాంట్నర్ పెవిలియన్ బాట పట్టాడు.

7వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ టార్గెట్ 398 పరుగులు కాగా, 47వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కివీస్ 7 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. శాంట్నర్ 8, సౌథీ 4 రన్స్ తో ఉన్నారు.

5వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

5వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.  ఫిలిప్స్ 41 ఔట్ చేసిన బుమ్రా. ఆల్ రౌండర్ జడేజా పట్టిన క్యాచ్ తో కివీస్ 5వ వికెట్ కోల్పోయి మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది.

IND vs NZ Live Score: మిచెల్ సెంచరీ, 35 ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోర్ 224/4. 

కివీస్ టార్గెట్ 398   -   35 ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోర్ 224/4. 
మిచెల్ 103, ఫిలిప్స్ 1 రన్స్ తో ఆడుతున్నారు.

ఒకే ఓవర్ లో డబుల్ దమాకా, షమీ ఖాతాలో మరో 2 వికెట్లు

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. మొదట విలియమ్సన్‌ను ఔట్ చేసిన షమీ, ఆపై అదే ఓవర్లో  టామ్ లాథమ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 33 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు నాలుగు వికెట్లకు 220 పరుగులు. కివీస్ 4 వికెట్లు కోల్పోగా, అన్నీ షమీనే పడగొట్టాడు.

IND vs NZ Live Score: న్యూజిలాండ్ స్కోరు 174/2

27 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 51, మిచెల్ 72 పరుగులతో ఆడుతున్నారు. వీరిద్దరూ  135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

IND vs NZ Live Score: మిచెల్ తరువాత కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ

కివీస్ బ్యాటర్స్ హాఫ్ సెంచరీలు చేశారు. డారిల్ మిచెల్ తర్వాత కేన్ విలియమ్సన్ కూడా అర్ధ శతకం సాధించాడు. విలియమ్సన్ 58 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డారిల్ మిచెల్ 61 బంతుల్లో 64 పరుగులతో ఉన్నాడు. 

కివీస్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు

398 టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. విలియమ్సన్ 6, మిచెల్ 14 పరుగులతో ఉన్నారు. 

న్యూజిలాండ్ రెండో వికెట్ కూడా షమీ ఖాతాలోకి

న్యూజిలాండ్ రెండో వికెట్ కూడా షమీ ఖాతాలోకి చేరింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ న్యూజిలాండ్‌ ను ఇబ్బంది పెడుతున్నాడు. తన తొలి ఓవర్లో కివీస్ ఓపెన్ కాన్వేను ఔట్ చేసిన షమీ, తన రెండో ఓవర్లో మరో ఓపెనర్ రచిన్ రవీంద్రను పెలియన్ బాట పట్టించాడు. 22 బంతుల్లో 13 పరుగులు చేసి రచిన్ ఔటయ్యాడు.

IND vs NZ Live Score: తొలి బంతికే వికెట్ పడగొట్టిన మహ్మద్ షమీ

398 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. 6వ ఓవర్ తొలి బంతికే పేసర్ మహ్మద్ షమీ వికెట్ తీశాడు. డెవాన్ కాన్వే ఇచ్చిన క్యాచ్ ను కీపర్ రాహుల్ పట్టడంతో కివీస్ ఓపెనర్ వికెట్ కోల్పోయింది.

IND vs NZ Live Score: 4 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 23

వన్డే ప్రపంచకప్‌ సెమీస్ లో 398 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 4 ఓవర్లలో 23 రన్స్ చేసింది.  కాన్వే 12, రచిన్ 8 పరుగులతో ఉన్నారు.

IND vs NZ Live Score: రెండో ఓవర్లో సిరాజ్ నాలుగు పరుగులు మాత్రమే

IND vs NZ Live Score:  రెండో ఓవర్‌ను మహ్మద్‌ సిరాజ్‌ వేశాడు. ఈ ఓవర్‌లో ఒక్క ఫోర్ మాత్రమే వచ్చింది. రెండు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు వికెట్ లేకుండా 12 పరుగులు. కాన్వే 8, రచిన్ 04 పరుగులతో ఉన్నారు.

IND vs NZ 1st Innings Full Highlights: న్యూజిలాండ్‌కు 398 పరుగుల టార్గెట్ ఇచ్చిన భారత్

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్ లో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు 398 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లి 117 పరుగులతో, శ్రేయాస్ అయ్యర్ 105 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇది కాకుండా రోహిత్ శర్మ 29 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా, శుభ్‌మన్ గిల్ 66 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచారు.

IND vs NZ LIVE SCORE: మెరుపు శతకం అనంతరం శ్రేయస్ అయ్యర్ ఔట్

వన్డే ప్రపంచకప్‌ సెమీస్ లో కివీస్ పై శతకం అనంతరం శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్ లో అయ్యర్ పెవిలియన్ చేరాడు. 70 బంతుల్లో 105 రన్స్ చేశాడు అయ్యర్. భారత్ 48.5 ఓవర్లలో 381/3 

కివీస్ పై శ్రేయస్ అయ్యర్ మెరుపు శతకం

వన్డే ప్రపంచకప్‌ సెమీస్ లో కివీస్ పై శతకం సాధించాడు శ్రేయస్ అయ్యర్. కేవలం 67 బంతుల్లోనే మెరుపు వేగంతో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. 

సెంచరీ అనంతరం విరాట్ కోహ్లీ ఔట్

117 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్


44వ ఓవర్ చివరి బంతికి 117 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. టిమ్ సౌథీ వేసిన బంతికి కోహ్లీ క్యాచ్ రూపంలో పెవిలియన్ చేరాడు. 44 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 327 పరుగులు.

వన్డేల్లో 50వ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ కోహ్లీ

వన్డే ప్రపంచకప్‌ సెమీస్ లో కివీస్ పై శతకం సాధించాడు విరాట్ కోహ్లీ. కాగా, వన్డేల్లో కోహ్లీకి ఇది 50వ సెంచరీ. 106 బంతుల్లో కీలక మ్యాచ్ లో కోహ్లీ శతక ఇన్నింగ్స్ తో అద్భుతం చేశాడు. సచిన్ 49 వన్డే శతకాల రికార్డును అధిగమించాడు.

IND vs NZ Live Score: దుమ్మురేపుతున్న బ్యాటర్స్, 200 దాటిన భారత్ స్కోరు

కేవలం 29 ఓవర్లలోనే టీమిండియా స్కోరు 200 దాటింది. విరాట్ కోహ్లీ 5 ఫోర్ల సాయంతో 57, శ్రేయాస్ అయ్యర్ ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 29 ఓవర్లకు  టీమిండియా వికెట్ నష్టానికి 203 పరుగులు చేసింది.

IND vs NZ  Live Score: సెమీస్ లో కివీస్ పై కోహ్లీ హాఫ్ సెంచరీ

వన్డే ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు. అతని వన్డే కెరీర్‌లో ఇది 72వ అర్ధ సెంచరీ. కోహ్లి 59 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. 28 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 197 పరుగులు చేసింది. కోహ్లీ 52, అయ్యర్ 15 పరుగులతో ఉన్నారు.

రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ లో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. 79 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెళ్లడంతో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు వచ్చాడు. 24 ఓవర్లలో టీమిండియా 173/1. కోహ్లీ 41 నాటౌట్, అయ్యర్ 3 నాటౌట్

150 మార్క్ చేరిన టీమిండియా

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ లో టీమిండియా 20 ఓవర్లలో 150 మార్క్ చేరింది. గిల్ 74 నాటౌట్,  కోహ్లీ 26 నాటౌట్

17 ఓవర్లలో టీమిండియా స్కోరు 132/1

17 ఓవర్లలో టీమిండియా స్కోరు 132/1.  గిల్ 63 నాటౌట్,  కోహ్లీ 19 నాటౌట్

 శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ, అభిమానుల హర్షం

వాంఖడే స్టేడియంలో భారత బ్యాట్స్ మెన్ న్యూజిలాండ్ బౌలర్ల,  ప్లేయర్లను పరుగులు  పెట్టిస్తున్నారు. శుభ్మన్ గిల్ కేవలం 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. గిల్ హాఫ్ సెంచరీతో ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. గిల్ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. 

టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ లో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. 42 బంతుల్లో 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కోహ్లీ 16 బంతుల్లో 15 నాటౌట్

14 ఓవర్లలో టీమిండియా స్కోరు 114/1
14 ఓవర్లలో టీమిండియా స్కోరు 114/1
భారత్ తొలి వికెట్ పడిపోయింది, రోహిత్ శర్మ ఔట్

వాంఖడే స్టేడియంలో నిశ్శబ్దం అలుముకుంది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న భారత కెప్టెన్ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో పట్టుబడ్డాడు. రోహిత్ శర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రోహిత్ శర్మకు అద్భుతమైన క్యాచ్ ఇచ్చాడు. విలియమ్సన్ క్యాచ్‌పై కామెంటేటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు.

ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 61-0

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో భారత్ మూడు పరుగులు సాధించింది. దీంతో ఏడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.

ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 58-0

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో భారత్ 11 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ ఒక సిక్సర్, ఫోర్ కొట్టాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.

ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 47-0

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో భారత్ 9 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది.

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 38-0

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో భారత్ 13 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఒక సిక్సర్, ఫోర్ కొట్టాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది.

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 25-0

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో భారత్ ఏడు పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది.

రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 18-0

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో భారత్ ఎనిమిది పరుగులు చేసింది. శుభ్‌‌మన్ గిల్ రెండు బౌండరీలు సాధించాడు. దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.

మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 10-0

ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్లో భారత్ 10 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెండు బౌండరీలు సాధించాడు.

వాంఖడే స్టేడియంలో పిచ్ స్వభావం ఎలా ఉంది? బౌలర్లు , బ్యాట్స్‌మెన్‌లో ఎవరిది పై చేయి?

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమైన  ముంబైలోని వాంఖడే స్టేడియంలో పిచ్ స్వభావం కాస్త మారినట్లు కనిపిస్తోంది. అంటే, ఈ మైదానంలో మునుపటి అన్ని మ్యాచ్‌ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. వాంఖడే పిచ్‌పై గడ్డిని తొలగించారు కాబట్టి స్వభావం మారినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించకపోవచ్చు. 


వాంఖడే పిచ్‌పై గడ్డి తొలగింపుతో కాస్త నెమ్మదించే ఛాన్స్ ఉంటుంది. అంటే స్పిన్నర్లు మరింత ప్రభావం చూపగలరు. అయితే ఈ పిచ్‌పై పెద్ద టర్న్ కు ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లలో కూడా బ్యాట్స్‌మెన్‌దే పై చేయి కానుంది. 


పిచ్ నెమ్మదించడం వల్ల టీమ్ఇండియాకు లాభం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి భారత పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి. అందుకే ఇలాంటి స్లో పిచ్‌లపై ఆడటం టీమిండియా ప్లేయర్లకు బాగా అలవాటు. గత కొన్నేళ్లుగా టీమ్ఇండియా ఈ స్లో పిచ్లపైనే ప్రత్యర్థి జట్లను ఓడించింది.

IND Vs NZ Semi-Final Score Live Updates: ముంబైలో వాతావరణం ఎలా ఉంది? సెమీఫైనల్ మ్యాచ్‌ టైంలో వర్షం పడే అవకాశం ఉందా?

ప్రపంచకప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్ ఈరోజు (నవంబర్ 15) మధ్యాహ్నం 2 గంటలకు భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రోజు ముంబై వాతావరణం క్లియర్ గా ఉండబోతోందని తెలిసి క్రికెట్ అభిమానులు చాలా సంతోషిస్తారు. అంటే భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో వర్షం పడే అవకాశం లేనట్టే. మధ్యాహ్నం ఆట ప్రారంభమయ్యే సమయానికి ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. మ్యాచ్ ముగిసే సమయానికి 30 డిగ్రీల వరకు వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో గాలిలో తేమ 40 శాతం వరకు ఉంటుంది. ఆకాశం 20 శాతం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. గాలి నాణ్యత కొంచెం అధ్వాన్నంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి హానికరం. 

Background

IND Vs NZ First Semi-Final Score Updates : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023(ODI World Cup 2023)లో భాగంగా ముంబై(Mumbai)లోని వాంఖడే(Wankhede) స్టేడియంలో భారత్(Team India ), న్యూజిలాండ్(New Zealand) జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్(First Semi Final Match) జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), మహ్మద్ షమీ (Mohammed Shami) అద్భుత ప్రదర్శనతో లీగ్ దశలో భారత్ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ఈ ఐదుగురు ఆటగాళ్లు మరో గొప్ప ప్రదర్శన చేసి ఫైనల్‌కు దూసుకెళ్లే వ్యూహంతో టీమిండియా ఉంది. కివీస్‌ను మరోసారి మట్టి కరిపించి టైటిల్‌కు మరో మెట్టు దగ్గరగా చేరుకోవాలనుకుంటోంది. 


వాంఖడేలో ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో టార్గెట్‌ను ఛేదించడం అంత ఈజీ కాదు. కొత్త బంతితో దెబ్బతీసే బౌలర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. రోహిత్‌ శర్మ మరోసారి రాణిస్తే టీమిండియాకు ఇక ఎదురుండదు. ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ 503 పరుగులు... గిల్‌ 270 పరుగులు చేశారు. మీరు మరోసారి విధ్వంసకర ఓపెనింగ్‌ ఇస్తే భారత్‌ గెలుపు ఖాయమవుతుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో 593 పరుగులు చేసి సచిన్‌ రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కె.ఎల్. రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది.టీమిండియా బౌలింగ్‌ విభాగం కూడా... పటిష్టంగా ఉంది. బుమ్రా , సిరాజ్‌, షమీ అదరగొడుతున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా పర్వాలేదనిపిస్తున్నారు.

 

సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్‌ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర ఈ ప్రపంచకప్‌లో 565 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.  డెవాన్ కాన్వే కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌లతో బౌలింగ్‌ కూడా బలంగా ఉంది. సొంత మైదానంలో బరిలోకి దిగుతున్న భారత క్రికెటర్ల ఒత్తిడిని సద్వినియోగం చేసుకోవాలని కివీస్‌ భావిస్తోంది.

 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్. 

 

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి , టిమ్ సౌతీ, విల్ యంగ్.

రోహిత్ శర్మ: ఈ ప్రపంచకప్ లో కెప్టెన్ ముందు ఎలా పోరాడాలో రోహిత్ శర్మ చూపించాడు. రోహిత్ శర్మ ఓపెనింగ్ ఆటతో లీగ్ దశలో పెద్ద జట్లపై భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 55.85 సగటు, 121.50 స్ట్రైక్ రేట్‌తో 503 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 24 సిక్సర్లు కొట్టాడు.


టీమిండీయాలో ఈ ఆటగాళ్లే కీలకం


విరాట్ కోహ్లీ: ఈ ప్రపంచకప్‌లో భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల హృదయాలను విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. ప్రపంచకప్‌లో 49వ సెంచరీ సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. విరాట్ కోహ్లీ 9 మ్యాచ్‌ల్లో 7 ఇన్నింగ్స్‌లలో 50కి పైగా పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 99.00 సగటుతో 594 పరుగులు చేశాడు.


శ్రేయస్ అయ్యర్: అయ్యర్ ఆశించిన విధంగా టోర్నమెంట్‌ను స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అయ్యర్ ఫామ్‌లోకి వచ్చి భారత్‌కు నాలుగో నంబర్ సమస్యను పరిష్కరించాడు. గత మూడు ఇన్నింగ్స్‌లలో అయ్యర్ ప్రతిసారీ 70కి పైగా పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో అయ్యర్ 421 పరుగులు చేశాడు.


జస్ప్రీత్ బుమ్రా: టీమ్ఇండియాకు వరల్డ్‌ కప్‌లో అతిపెద్ద ఆటగాడిగా నిరూపించుకుంటున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది జస్ప్రీత్ బుమ్రా. గాయం కారణంగా ఏడాది పాటు జట్టుకు దూరమైన తర్వాత కూడా బుమ్రా తనకు పోటీ లేదని ప్రపంచకప్ వేదికపై నిరూపించాడు. ప్రపంచకప్‌లో బుమ్రా అత్యధిక డాట్ బాల్స్ వేయడమే కాకుండా 17 వికెట్లు పడగొట్టాడు.


మహ్మద్ షమీ: లీగ్ దశలో తొలి నాలుగు మ్యాచుల్లో షమీకి టీమిండియా ఆడే అవకాశం ఇవ్వలేదు. కానీ షమీకి అవకాశం వచ్చినప్పుడు తనను పక్కన పెట్టి చేసిన తప్పును యాజమాన్యానికి తెలియజేశాడు. తొలి మ్యాచ్‌లోనే షమీ 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాతి మ్యాచ్‌లో షమీ 4 వికెట్లు తీయగా, మరుసటి మ్యాచ్ లో షమీ మళ్లీ 5 వికెట్లు తీశాడు. షమీ 5 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను కకావికలం చేశాడు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.