Election Commission Released Revised Voters List: పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు సవరించిన ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశాయి. ఏపీలో 2025 జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల సంఖ్య 4,14,40,447 గా ఉండగా.. తెలంగాణలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు.
ఏపీ ఓటర్ల జాబితా..
ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447 గా ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,81,814గా ఉంది.
- పురుష ఓటర్లు - 2,02,88,543.
- సర్వీస్ ఓటర్లు - 66,690.
- థర్డ్ జెండర్ ఓటర్లు - 3,400 మంది ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.
- 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 5,14,646 మంది ఉన్నట్లు తెలిపింది.
- రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. గతేడాదితో పోలిస్తే 232 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని పేర్కొంది.
తెలంగాణ ఓటర్ల జాబితా..
తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం.. మొత్తంగా రాష్ట్రంలో 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
- పురుష ఓటర్లు - 1,66,41,489
- మహిళా ఓటర్లు - 1,68,67,735.
- థర్డ్ జెండర్లు - 2,829.
- 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు - 5,45,026.
- 85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు - 2,22,091.
- ఎన్ఆర్ఐ ఓటర్లు - 3,591.
- ప్రత్యేక ప్రతిభావంతులైన ఓటర్లు - 5,26,993.
- శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లున్నారు.