IND Vs PAK: పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ తుదిజట్టు ఇదేనా? - శ్రేయస్, రాహుల్‌ల్లో చోటు ఎవరికి?
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత్ అంచనా తుది జట్టు ఇదే.
India vs Pakistan: 2023 ఆసియా కప్‌లో సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. రేపు (ఆదివారం) సెప్టెంబర్ 10వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండవచ్చు?
అంతకుముందు లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. కేవలం భారత్ మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. పాక్ బౌలర్ల ధాటికి భారత జట్టు 266 పరుగులకే ఆలౌట్ అయింది. షహీన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీశాడు. నసీమ్ షా, హరీస్ రౌఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం కెప్టెన్ రోహిత్ శర్మకు అంత సులభం కాదు. నిజానికి ఈ మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఇద్దరూ అందుబాటులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరినీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చడం రోహిత్ శర్మకు అంత సులభం కాదు. జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి రావడం ఖాయం. కేఎల్ రాహుల్ శుక్రవారం ప్రాక్టీస్ చేయడం కూడా కనిపించింది. కేఎల్ రాహుల్‌ను కూడా తుది జట్టులో చేర్చనున్నట్లు తెలుస్తోంది.
లీగ్ దశలో పాకిస్తాన్‌పై ఇషాన్ కిషన్ 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ ఒత్తిడిలో బ్యాటింగ్ చేసిన తీరు చూసిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవడం లేదు. అటువంటి పరిస్థితిలో శార్దూల్ ఠాకూర్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్ తిరిగి రావచ్చు.
భారత్ తుదిజట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ / కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ