అన్వేషించండి

England Cricket team: అమ్మో-పెద్ద ప్లానే, భారత్‌ను వీడనున్న ఇంగ్లాండ్‌ జట్టు

IND vs ENG: రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుండగా 10 రోజల విరామ సమయాన్ని అబుదాబిలో గడపడానికి ఇంగ్లాండ్‌జట్టు సిద్ధమైంది.

England team to head back to Abu Dhabi: వైజాగ్‌(Vizag)లో జరిగిన రెండో టెస్ట్‌లో పరాజయంపాలైన ఇంగ్లాండ్‌(England) మరో మూడు టెస్ట్‌ మ్యాచులు మిగిలి ఉండగానే భారత్‌ను వీడనుంది. అదేంటీ సిరీస్‌ మధ్యలో వైదొలగడం ఏంటి అని అనుకుంటున్నారా... దాని వెనక బ్రిటీష్‌ జట్టు ప్రణాళిక వేరే ఉంది. రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుండగా 10 రోజల విరామ సమయాన్ని అబుదాబిలో గడపడానికి ఇంగ్లాండ్‌జట్టు సిద్ధమైంది. కొంత విశ్రాంతి తీసుకుని తరువాత టెస్టుకు అన్ని విధాల సిద్ధమవుతామని జట్టు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. 

ఉప‌ఖండ‌పు పిచ్‌ల‌పై రాణించేందుకు అబుదాబీ పిచ్‌ల‌పై ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు తీవ్రంగా సాధ‌న చేశారు. భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎలా ఎదుర్కొవాల‌నే దానిపైనే ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. మొదటి టెస్టులో ఓటమి పాలైన భారత్‌ రెండో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. ఈ పర్యటనకు ముందు ఇంగ్లాండ్‌ జట్టు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అబుదాబి క్యాంప్‌లో చాలా కసరత్తులు చేసింది. మొదటి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

సిరీస్‌ సమం...
విశాఖ వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో టీమిండియా(Team India) గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌(yashasvi jaiswal) ద్విశతకంతో కదంతొక్కడంతో396 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బుమ్రా ఆరు వికెట్లతో సత్తాచాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 253 పరుగులకు కుప్పకూలింది.

రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్‌ గిల్(Subhaman gill) సెంచరీతో రాణించడంతో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 399 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ ఒక వికెట్‌ నష్టానికి 67 పరుగుల స్కోరుతో నాలుగోరోజు లక్ష్య ఛేదనను కొనసాగించిన ఇంగ్లాండ్‌కు తొలి సెషన్‌లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఆరంభంలో భారత బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు కీలక సమయంలో వికెట్లను సమర్పించుకున్నారు. జాక్‌ క్రాలే 73 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌, టామ్‌ హార్ట్‌లీ చెరో 36 పరుగులతో ఫర్వాలేదనించారు. అశ్విన్‌, బుమ్రా చెరో 3 వికెట్ల పడగొట్టారు. ముకేశ్‌, కుల్‌దీప్‌, అక్షర్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. ఈ నెల 15న రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

బూమ్‌ బూమ్‌ బుమ్రా..
ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. చేతన్‌ శర్మ తర్వాత ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత సీమర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. 1986లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో చేతన్ శర్మ 188 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 91 పరుగులు సమర్పించుకుని 9 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు బుమ్రా కెరీర్‌లో రెండో బెస్ట్‌ కావడం గమనార్హం. బుమ్రా ఇప్పటివరకూ తొమ్మిది సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. బుమ్రా 33 టెస్ట్‌ల్లో 20.82 సగటున 146 వికెట్లు పడొట్టాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget