By: ABP Desam | Updated at : 21 Jul 2022 03:56 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
బీసీసీఐ వరల్డ్ క్రికెట్‌లోనే రిచస్ట్ క్రికెట్ సంస్థ. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరూ చెప్పుకునే విషయం. ఇప్పుడు ఇది మరోసారి ప్రూవ్ అయింది. జనరల్‌గా ఫారిన్ టూర్‌కు వెళ్లినప్పుడు కమర్షియల్ ఫ్లైట్‌లో టికెట్స్ బుక్ చేస్తారు. అయితే విండీస్ టూర్‌కు వెళ్లిన టీమిండియా కోసం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసింది బీసీసీఐ.
ఈ మధ్య ఇంగ్లండ్ టూర్‌లో చాలా మంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. చిన్న చిన్న తప్పులు కారణంగానే ప్రధాన ఆటగాళ్లు తుది జట్టుకు దూరమయ్యారు. దీంతో విండీస్ టూర్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంది బీసీసీఐ. అంతే కాకుండా ఆటగాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించి చార్టెట్ ఫ్లైట్ బుక్ చేసింది.
విండీస్ టూర్‌కు ఎంపికైన ఆటగాళ్లను, వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను ట్రినిడాడ్ వరకు స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకెళ్లింది. దీని కోసం మూడున్నర కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లు, వాళ్ల భార్యలు కూడా ప్రయాణిస్తున్నందున ఫ్లైట్ బుక్ చేసినట్టు సమాచారం. వాణిజ్య విమానంలో ఇంతమందికి టికెట్స్ బుకింగ్ కష్టమని ఏకంగా ఫ్లైట్ బుక్ చేసింది బీసీసీఐ.
Trinidad - WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022
మంగళవారం మధ్యాహ్నం మాంచెస్టర్ నుంచి పోర్ట్-ఆఫ్-స్పెయిన్‌కు రాత్రి 11:30లోపు టీమ్ ఇండియాను తీసుకెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్ కోసం BCCI రూ. 3.5 కోట్లు ఖర్చు చేసింది. భారత బృందంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సహా 16 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సభ్యులు ఈ ఫ్లైట్‌లో వెళ్లారు. ఇందులో కొందరి భార్యలు కూడా ప్రయాణించారు.
విండీస్ టూర్‌లో టీమిండియా 3 వన్డేలు ఆడనుంది. భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
తొలి వన్డే జూలై 22 (శుక్రవారం) ట్రినిడాడ్‌లో జరుగుతుంది.
Ganguly vs Virat Kohli: కెప్టెన్సీ నుంచి కోహ్లిని నేను తప్పించలేదు, మరోసారి వివరణ ఇచ్చిన దాదా
Smriti Mandhana: మరో నాలుగు రోజుల్లో వేలం, స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
IND vs AUS: టీమిండియా క్రికెట్ ఇంతే, ఇంకెంత కాలం ఇలా?
PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!
BCCI Secretary Jay Shah: జైషాకు అరుదైన గౌరవం , క్రీడల్లో ఇప్పటివరకూ ఎవరికీ దక్కని అవార్డు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>