News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

వాస్తు నియమాలు పాటించేందుకు మాదేమైనా సొంత ఇల్లా అని అనుకుంటే పొరపాటేనా? అద్దె ఇంటికి కూడా వాస్తు నియమాలు పాటించాలా? వాస్తు పండితులు ఏం చెబుతున్నారు...

FOLLOW US: 
Share:

Vastu Tips In Telugu: సొంత ఇల్లు అయితేనే వాస్తు నియమాలు పాటిస్తాం అద్దెంటికి అవసరం  లేదు అనుకోవద్దంటారు వాస్తు నిపుణులు. ఇది ఎంతమాత్రం సరైన ఆలోచన కాదంటారు వాస్తు పండితులు. ఎందుకంటే అద్దె ఇంటి వాస్తు సరిగ్గా ఉన్నప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది, 
సొంతింటి కల నెరవేరాలంటే అప్పటి వరకూ అద్దెకు ఉండే ఇల్లు కూడా వాస్తురీత్యా బావుండాలి. మీరు ఉండేది ఉర్లో అయినా సిటీలో అయినా, ఇండివిడ్యువల్ అయినా అపార్ట్ మెంట్ అయినా వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. వాస్తు అత్యద్భుతంగా లేకపోయినా కనీసం పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. వాటిని విస్మరిస్తే మీ జీవితం ఏకంగా అద్దెఇంటికే అంకింతమైపోతుందంటారు. అన్నివిధాలుగా సరిగ్గా వాస్తుండే ఇంట్లో అద్దెకు ఉంటే ఆస్తులు కలసిరావడమే కాదు సొంతింటి కల కూడా నెరవేరుతుంది.

Also Read: ఇంటి ఆవరణలో ఉండాల్సిన - ఉండకూడని చెట్లు ఇవే!

అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తలివే

 • ఈశాన్యంలో ద్వారం,గృహం మధ్యన ఖాళీ ఉండటం చాలా ముఖ్యం 
 • ఆగ్నేయంలో వంట గది ఉండాలి
 • నైరుతిలో బాల్కనీ ఉండరాదు
 • ఇల్లు దిక్కులు క్రాస్ గా కాకుండా ఓ తీరుగా - సరిగా ఉండాలి
 • నైరుతి, దక్షిణ, పశ్చిమం వైపు మాస్టర్ బెడ్‌రూమ్ ఉందోలేదో చూసుకోవాలి
 • ప్రతి పోర్షన్  దీర్ఘ చతురస్త్ర ఆకారంలో ఉండాలి, వృత్తాకారంలో అస్సలు ఉండకూడదు
 • నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు
 • ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు అనుగుణంగా ఉండాలి
 • వీధిపోట్లు, రోడ్డునుంచి పల్లంగా ఉన్న ఇళ్లు మంచివికావు. కొన్ని వీధిపోట్లు కలిసొస్తాయి...
 • టాయ్‌లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది

వాస్తుతో సంబంధం లేకుండా పట్టించుకోవాల్సిన విషయాలు

అదే ఇంట్లో మీకన్నా ముందు అద్దెకు ఎవరున్నారు, వాళ్లకి కలిసొచ్చిందా మరింత నష్టపోయారా, ఏవైనా ఇబ్బందులు పడ్డారా, యాక్సిడెంట్లు ఏమైనా జరిగాయా, ఇంకా అనారోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, కుటుంబంలో కలహాలు ఏమైనా జరిగాయేమో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆ పోర్షన్ తరచూ ఖాళీ అవుతోందా అన్నది కూడా గమనించాలి. ఎందుకంటే వాస్తు బావున్న ఇళ్లు తరచూ ఖాళీ అవవు. అన్ని విధాలుగా వాస్తు బావున్న ఇంట్లోంచి వెళ్లాలని ఎవ్వరూ అనుకోరు..సొంతిల్లు కొనుక్కుంటే తప్ప...

Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

గృహమే కదా స్వర్గసీమ

గృహమే కదా స్వర్గసీమ అంటారు. అలాంటప్పుడు ఆ ఇంట్లో నివాసం ఉంటే అంతా మంచి జరగాలి కానీ అడుగుపెట్టగానే ఆందోళన కలగకూడదు. తరచూ సమస్యలు ఎదురవకూడదు. వాస్తు బావున్నప్పటికీ తరచూ కష్టాలు, సమస్యలు వస్తున్నాయంటే ఇదే కారణం అని చెబుతారు వాస్తు పండితులు. 

వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు , ఏవీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ వాస్తు పట్టింపు ఉండేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి జరుగుతుంది.   

Also Read: మీ ఇంటి వాలు మీ ఆదాయ-వ్యయాలను నిర్ణయిస్తుందని మీకు తెలుసా!

గమనిక: కొందరు వాస్తుపండితుల నుంచి సేకరించిన సలహాలు, కొన్ని పుస్తకాలు ఫాలో అయి రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం... 

Published at : 27 Sep 2023 07:12 AM (IST) Tags: vastu shastra vastu for home vastu tips in telugu vastu doors and windows

ఇవి కూడా చూడండి

Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!

Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
×