Image Credit: Pinterest
Vamana Jayanti 2023
పఙ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ అధ్వరమ్ బకేః |
పదత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్టపమ్ ||
ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం.
వామనుడి పుట్టుక
హరిణ్యకశిపుడి తనయుడైన భక్త ప్రహ్లాదుడికి మనవడు, వైరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. విశ్వజిత్ యాగము చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిచక్రవర్తిని నిలువరించడం ఎవరి తరం కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి శ్రీ విష్ణుమూర్తినే శరణువేడారు. అప్పుడు విష్ణుమూర్తి తాను అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి వామనుడిగా జన్మించి బలిచక్రవర్తిని అణిచేసే రోజుకోసం ఎదురుచూడసాగాడు.
మూడు అడుగులు
బలి ఒకసారి అశ్వమేథయాగాన్ని తలపెడతాడు. బలిని అణగదొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి (వామనుడు) రూపంలో యాగశాల వద్దకు వెళతాడు. బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి, సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు. వామనుడు తనకు యాగం చేసుకునేందుకు మూడు అడుగుల నేల కావాలని అడుగుతాడు. అంతే కదా తీసుకో అని సంతోషంగా అంగీకరిస్తాడు బలి. దానం అడుగుతున్నవాడు...వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీమహావిష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. అదే విషయం బలిని పిలిచి చెబుతాడు కానీ అప్పటికే మాటిచ్చేశానని..ధన ప్రాణాలపై ఉన్న వ్యామోహంతో మాట వెనక్కు తీసుకోలేనని చెప్పేస్తాడు బలి. తనమాట ధిక్కరించినందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు రాజ్యభ్రష్టుడవు అవుతావని బలిని శపిస్తాడు.
Also Read: మీ ఇంటి వాలు మీ ఆదాయ-వ్యయాలను నిర్ణయిస్తుందని మీకు తెలుసా!
శుక్రాచార్యుడు ఓ కన్ను కోల్పోవడానికి కారణం ఇదే
బలి చక్రవర్తి వామనుని పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకుంటాడు. వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదగా వామనుని చేతిలోకి నీళ్ళు పోస్తుంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంలో శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భ పుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఓ కన్ను కోల్పోతాడు.
బ్రహ్మాండాన్ని ఆక్రమించిన వామనుడు
దానం స్వీకరించిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించేస్తాడు. ఓ అడుగు భూమ్మీద, మరో అడుగు ఆకాశం మీద వేసి మూడో అడుగు ఎక్కడ వేయాలని అడుగుతాడు. అప్పుడు బలి ‘నా తలపై వేయి’అని తలొంచుతాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అధ:పాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోషించిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. కేరళలో ఓనం పండగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
త్రివిక్రముడు
మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలున్నాయి. కంచిలో ఉన్న ‘ఉళగలంద పెరుమాళ్’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.
వామనుడు బ్రహ్మాండ రూపం పొందిన వర్ణన...
ఇంతింతై వటు దింతయై మరియు తానింతై
నభో వీధిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై
ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై
ధ్రువునిపై నంతై మహార్వాటిపై నంతై
సత్యపదోన్నతుం డగుచు
బ్రహ్మాండాంత సంవర్ధియై
Also Read: ఈ రాశులవారికి ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి, సెప్టెంబరు 26 రాశిఫలాలు
వామనుడు కోరిన వెనుకున్న ఆంతర్యం ఇదే
వామనుడు కోరిన మూడు అడుగులు సత్వరజోతమోగుణాలనీ, సృష్టిస్థితిలయలనీ సూచిస్తాయని అంటారు. ఇక బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే. వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని కొలిచిన వారు కూడా ఆ అహంకారాన్ని జయించి, ఈతి బాధల నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం. మన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువుని పూజిస్తే శుభప్రదం.
Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!
Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!
Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచనలు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది
Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!
Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>