Makar Sankranti 2026: మకర సంక్రాంతి 2026 పితృ దోషం నుంచి విముక్తి కలిగించే 5 అద్భుతమైన ఉపాయాలు! శుభ ముహూర్తం , ప్రాముఖ్యత
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఈ రోజున సుఖ సమృద్ధికి ప్రత్యేక నియమాలు పాటించాలని సూచిస్తున్నారు పండితులు

Makar Sankranti 2026 Upay:హిందువుల పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి . దీనిని భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో భక్తి, ఉత్సాహం, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఈ పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది, ఇది శీతాకాలం ముగింపును, పగటి సమయం పెరగడాన్ని సూచిస్తుంది.
సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు, మకర సంక్రాంతిని ఆధ్యాత్మిక సాధన, ఆరోగ్యం, సుఖసంతోషాల కోసం కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.
15 జనవరి 2026న మకర సంక్రాంతి
హిందూ పంచాంగం, వేద జ్యోతిష్య గణనల ప్రకారం.. 2026లో సూర్యుడు 14 జనవరి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని ఈ గోచరాన్నే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. సాంప్రదాయకంగా, ఈ రోజు పవిత్ర స్నానం, దానం, ఆరోగ్యం, శ్రేయస్సు ,ఆధ్యాత్మిక శాంతిని అందించే రోజు.
మకర సంక్రాంతి పితృ దోషానికి ప్రాముఖ్యత
ఎవరి జాతకంలోనైనా దోషాలు ఉన్నాయో, వారికి మకర సంక్రాంతి రోజున ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలో పితృ దోషం ఉంటే, వారు వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆధ్యాత్మిక జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ మకర సంక్రాంతి రోజున కొన్ని ప్రత్యేక కర్మలు చేయడం ద్వారా పితృ దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. మత విశ్వాసాల ప్రకారం, సూర్యుడు మరియు శ్రీమహావిష్ణువు పూజ, దానధర్మాలు , సాంప్రదాయ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు , దోషాల ప్రభావం తగ్గుతుంది.
మకర సంక్రాంతి 2026 కోసం జ్యోతిష్యం సూచించిన పరిహారాలు?
జ్యోతిష్య పండితులు సురేష్ శ్రీమాలి ప్రకారం.. ఈ రోజు నల్ల నువ్వులు మరియు ఎర్రటి పువ్వులతో కలిపిన నీటిని సూర్య భగవానుడికి సమర్పించడం ద్వారా దివంగత పూర్వీకుల ఆత్మలు సంతోషిస్తాయి. ఈ కర్మను చేసేటప్పుడు 'ఓం పితృ దేవాయ నమః' అనే మంత్రాన్ని జపించండి.
ఆవులు, కుక్కలు , కాకులకు ఆహారం పెట్టాలి, ఎందుకంటే పూర్వీకులు ఈ జీవుల ద్వారానే కానుకలను స్వీకరిస్తారని నమ్ముతారు.
మకర సంక్రాంతి రోజున సాయంత్రం మీ ఇంటి దక్షిణ దిశలో పూర్వీకుల పేరుతో దీపం తప్పక వెలిగించండి.
మకర సంక్రాంతి సందర్భంగా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. విశ్వాసాల ప్రకారం, ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోయి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది.
మకర సంక్రాంతి రోజున అవసరమైన వారికి ధాన్యం, వస్త్రాలు లేదా ఇతర అవసరమైన వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది , పితృ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.
మకర సంక్రాంతి ఆధ్యాత్మిక ప్రయోజనం
మకర సంక్రాంతి రోజున కర్మలు చేయడం వల్ల పితృ దోషం ప్రభావం తగ్గడమే కాకుండా, కుటుంబ, ప్రేమ జీవితంలో సంబంధాలు బలపడతాయి. మకర సంక్రాంతి కేవలం పంట , ఆనందానికి సంబంధించిన పండుగ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక చికిత్సకు ఒక సువర్ణావకాశం కూడా.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















