News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Spirituality: రంగనాథుడు కొలువైన ఈ 5 క్షేత్రాలు చాలా ప్రత్యేకం- మీరెన్ని దర్శించుకున్నారు!

పంచభూత లింగక్షేత్రాలు, పంచారామాల గురించి వినే ఉంటారు. మరి..పంచరంగ క్షేత్రాల గురించి తెలుసా? అంటే రంగనాథుడు కొలువైన ఐదు ప్రత్యేక క్షేత్రాలివి..ఎక్కడున్నాయి, వీటిలో మీరెన్ని దర్శించుకున్నారు...

FOLLOW US: 
Share:

Pancharanga Kshetras: నీటిని ఏ పాత్రలోకి ఒంపితే ఆ రూపం పొందుతుంది. భగవంతుడు కూడా అంతే..భక్తులకు కావాల్సిన రూపంలో కనిపిస్తూ అనుగ్రహిస్తుంటాడు.  అలా ఆదిశేషుని మీద శయనించే  శ్రీ మహావిష్ణువుని రంగనాథస్వామిగా కొలుస్తారు. దక్షిణాదిన ఈ రంగనాథస్వామి ఆలయాలు చాలా కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాలు..అంటే ఐదు ప్రదేశాలు అత్యంత విశిష్ఠమైనవని చెబుతారు. వీటిని ఒక్కసారి దర్శించుకున్నా సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం..

కావేరీ నదీ తీరాన వెలసిన పంచరంగ క్షేత్రాల వివరాలివే...

1. శ్రీరంగపట్నం

శ్రీరంగం ఆలయం, తిరుచిరాపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కావేరి - కొల్లిదం నదుల మధ్య ఆలయం కొలువై ఉంది. ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణుభగవానుని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది, స్వయంభూ క్షేత్రం కూడా. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువరంగన్ అని పిలుస్తారు. శ్రీరంగం ఆలయాన్ని " ఇండియన్ వాటికన్" గా కూడా పిలుస్తారు. శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించారు. టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే

Also Read: అర్థరాత్రి వేణుగానం, గజ్జెల శబ్దాలు…ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యం..ఆ ఆలయంలో చీకటి పడ్డాక ఏం జరుగుతుంది..!

2. తిరుప్పునగర్‌

తమిళనాడు తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి శ్రీ మహావిష్ణువు ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరకపోవడంతో చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని చెబుతారు.

3. కుంభకోణం

ఒకప్పుడు హేమ రుషి ... సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత శ్రీ మహావిష్ణువు కూడా ఉండాలి కదా.. లా వైకుంఠం నుంచి స్వామివారు స్వయంగా వచ్చి అవతరించారు. ఇక్కడ స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు.

4. మయిలదుతురై

చంద్రుని తపస్సుకి మెచ్చి  విష్ణుమూర్తి అవతరించిన ప్రదేశం అని...పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారని చెబుతారు. ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ‘పరిమళ పెరుమాళ్‌... వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు.

Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..

5. శ్రీరంగం

పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని చివరి క్షేత్రంగా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న శంఖురూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెబుతారు.  గోదాదేవి శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ జరుగుతాయని నమ్మకం.

ఇందులో కుంభకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటారు

Published at : 21 Sep 2023 05:33 AM (IST) Tags: Lord Vishnu importance of pancharanga kshetrams pancharanga kshetrams

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ