By: ABP Desam | Updated at : 06 Apr 2022 06:03 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 ఏప్రిల్ 6 బుధవారం రాశిఫలాలు
2022 ఏప్రిల్ 6 బుధవారం రాశిఫలాలు
మేషం
బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి డీల్ కుదురుతుంది. ఉత్పత్తి వ్యాపారం చేసేవారికి అద్భుతమైన పురోగతి ఉంటుంది. కళాకారులకు మంచి అవాకాలు లభిస్తాయి. వ్యాయామంపై దృష్టిసారించి ఒత్తిడి తగ్గించుకోండి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
వృషభం
మీరు తలపెట్టిన పనిలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.ఎవ్వరి చేతుల్లోనూ మోసపోకుండా జాగ్రత్తపడండి. స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.
మిథునం
ఈరోజంతా అంతబాగా ఉండదు. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి.మధ్యాహ్నం తర్వాత అన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ మాటను శాంతియుతంగా చెప్పండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. మీ పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే
కర్కాటకం
బంధువులతో మీకున్న గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యాలయంలో పని విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. భాగస్వామ్య వ్యాపారం నుంచి భారీ లాభాలు పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో పార్టీలు చేసుకుంటారు. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. .
సింహం
ఈ రోజు మీకు బాగానే ఉంటుంది.ఆఫీసులో సహోద్యోగులతో మీ సఖ్యత బాగుంటుంది. కెరీర్ ముందుకు సాగేందుకు అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. మీరు వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. ఒంటరివారికి వివాహ ప్రతిపాదన రావచ్చు.
కన్యా
ఈ రోజు మీ రోజు మతపరమైన పనుల్లో బిజీగా గడుపుతారు. నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దంపతులు కలిసి సరదాగా గడుపుతారు. మీరు మీ ప్రాధాన్యతలను గుర్తుంచుకోవాలి. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
తుల
క్రమశిక్షణతో ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆహారం విషయంలో నియంత్రణ అవసరం.కుటుంబ సభ్యుల మనోభావాల పట్ల శ్రద్ధ వహించండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీరు శారీరకంగా మరియు మానసికంగా కొంచెం బలహీనంగా అనిపించవచ్చు. దైవదర్శనానికి వెళతారు.
వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. వ్యాపారంలో భాగస్వాములపై ఒక కన్నేసి ఉంచాలి.విద్యార్థులు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.మీ ఆలోచనల్లో స్పష్టంగా ఉండండి. డబ్బు ఖర్చుపెట్టేటప్పుడు ఓసారి ఆలోచించండి.
ధనుస్సు
ఇంటి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రత్యర్థుల వల్ల ఇబ్బందుల్లో పడొచ్చు. సన్నిహితులు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది. దిగుమతి-ఎగుమతులకు సంబంధించిన వ్యాపారంలో మీరు లాభాన్ని పొందుతారు. సామాజిక సేవలో సక్సెస్ అవుతారు. పాతమిత్రులను కలుస్తారు.
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
మకరం
కొత్త ఉద్యోగం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచిసమయం. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో కొత్తదనం కనిపిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది.వ్యాపారంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహా తీసుకోవాలి. నిర్మాణ రంగానికి సంబంధించిన వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
కుంభం
రిస్క్ తీసుకోవాల్సి రావొచ్చు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. తప్పుడు చర్యలు చెడు పరిణామాలను కలిగిస్తాయి. వెన్ను నొప్పి ఇబ్బంది కలిగిస్తుంది.పొదుపుపై చాలా శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకండి. కుటుంబ వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు.
మీనం
ఈరోజు మంచి రోజు అవుతుంది.ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు.ఆఫీస్‌లో మీకు పెద్ద బాధ్యత ఉంటుంది. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది.
Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు
Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?