News
News
X

Horoscope Today 6th March 2022:మీ తప్పులను దాచకుండా ఒప్పుకోండి, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

6 మార్చి 2022 ఆదివారం రాశిఫలితాలు

మేషం
మీకు గౌరవం లభిస్తుంది. నిలిచిపోయిన పనుల వల్ల మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. వైవాహిక సంబంధాల్లో ఉన్న ఇబ్బందులు  తొలగిపోతాయి. శుభకార్యాల్లో కుటంబంతో కలసిసంతోషంగా పాల్గొంటారు.

వృషభం
అనారోగ్య సమస్యలు ఆందోళనకలిగిస్తాయి. మీ విజయాలను ప్రదర్శించడం మానుకోండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కార్యాలయంలో మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది.

మిథునం
కొత్తగా తలపెట్టిన పనులు కలిసొస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది శుభసమయం. జీవిత భాగస్వామి పట్ల మీ భక్తి పెరుగుతుంది. స్నేహితులు, సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది.  ఉద్యోగం చేసే వ్యక్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. 

కర్కాటకం
సామాజిక చర్చల్లో పాల్గొంటారు. మీ దినచర్యను క్రమశిక్షణగా ఉంచుకోండి. ప్రేమికులు తమ భాగస్వామికి ఎలాంటి వాగ్దానాలు చేయకూడదు. మీరు మీ బాధ్యతల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీరు ఈరోజు చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.

Also Read: సెల్ప్ రెస్పెక్ట్ కి ఇంతకన్నా నిదర్శనం ఎవరుంటారు, అందుకే ఆమె తరతరాలకు ఆదర్శం

సింహం
పని విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.  తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా మంచిది. ఉన్నత విద్యలో సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. న్యాయపరమైన అంశాలు పరిష్కారమవుతాయి.

కన్య 
ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ప్రవర్తనలో దృఢత్వాన్ని తీసుకురావద్దు. వైవాహిక సంబంధాల్లో కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రయత్నించండి.  మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల సలహాలను అనుసరించండి. టెన్షన్ తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.

తుల
కుటుంబ సమస్యలు దూరమవుతాయి. మీరు వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన వ్యాపారంలో పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

వృశ్చికం
అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. అధిక అలసట కారణంగా, పనితీరు ప్రభావితం కావచ్చు. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోతారు. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. మీరు కార్యాలయంలో శుభవార్తలు వింటారు.

Also Read: పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే దాంపత్య సమస్యలు తప్పవట

ధనుస్సు 
భారీ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలతో కోపంగా మాట్లాడకండి. దానధర్మాలు చేస్తారు. మీ సన్నిహితుల ఆలోచన ప్రభావం మీపై ఉంటుంది...దానివల్ల మంచే జరుగుతుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు.

మకరం
కొన్ని పనుల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ వస్తువులను జాగ్రత్తగా వాడండి. తప్పులను దాచడానికి బదులు ..తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు.  పెట్టుబడికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు.

కుంభం
అవసరమైన ప్రణాళికకు సంబంధించి స్నేహితులతో సమావేశం అవుతారు. కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీరు సీనియర్ల సహాయం తీసుకోవాలి. మీ మాటలకు ప్రజలు ఆకట్టుకుంటారు. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.
 
మీనం
ప్రేమికులు వివాహానికి సబంధించి ముందడుగు వేయొచ్చు. వ్యాపారులకు ఈరోజు శుభప్రదం. వేరేవారి పనిలో జోక్యం చేసుకోవద్దు. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ తప్పులను దాచడానికి ప్రయత్నించవద్దు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

Published at : 06 Mar 2022 05:32 AM (IST) Tags: Horoscope Today Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 6th March 2022

సంబంధిత కథనాలు

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

టాప్ స్టోరీస్

Sajjala On Gorantla : ఫిర్యాదు లేదు - చర్యలుండవ్ ! గోరంట్ల మాధవ్‌ విషయంలో సజ్జల క్లారిటీ

Sajjala On Gorantla : ఫిర్యాదు లేదు - చర్యలుండవ్ ! గోరంట్ల మాధవ్‌ విషయంలో సజ్జల క్లారిటీ

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!