News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Spirituality: ఈ ఆలయ నిర్మాణానికి 39 ఏళ్లు పట్టింది, దీని ప్రత్యేకత ఏంటంటే!

ఆసియా ఖండంలో అంత్యంత ఎత్తైన శివాలయం. దీని నిర్మాణానికే 39 ఏళ్లు పట్టిందట. ఈ ఆలయంలో అంత అద్భుతం ఏముంది? ఆ విశేషాలు మీకోసం..

FOLLOW US: 
Share:

Jatoli Shiv Temple In Solan Himachal Pradesh:  హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లా జటోలి టౌన్ లో ఉన్న శివాలయం ఇది. దాదాపు నలభైఏళ్లు శ్రమిస్తే ఇంత అద్భుతమైన దేవాలయం సిద్ధమైంది. అక్కడ పర్యాటక ప్రదేశాల్లో అత్యంత ఆకర్షణీయమైన ఆలయం ఇది. ఈ ఆలయ నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు భక్తులు. శివుడి జటల నుంచి వచ్చిన పేరుతోనే ఈ ప్రదేశానికి జటోలి అని పెట్టారు. 

ఈ ఆలయం గురించి వినిపిస్తున్న కథనాలు

పురాణాల ప్రకారం శివుడు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఉన్నాడట. ఆ తర్వాత స్వామి కృష్ణానంద్  ఇక్కడకు వచ్చి తపస్సు చేశారనీ ప్రతీతి. బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు. 

Also Read: సెప్టెంబరు 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇచ్చే సలహాలు అందరకీ బాగా ఉపయోగపడతాయి

ఆలయ నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు

జటలో ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ద్రవిడ శైలిలో మూడు వరుస పిరమిడ్లతో నిర్మించారు. మొదటి పిరమిడ్  , రెండవ పిరమిడ్ లో శేష్ గాన్ శిల్పం,  వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఆలయం లోపల, ప్రాంగణంలో వివిధ దేవతల విగ్రహాలు అత్యత్భుతంగా చెక్కారు.లోపల స్పటిక మణి శివలింగంతో పాటు శివ, పార్వతుల విగ్రహాలు కూడా ప్రతిష్టించారు. ఆలయం ఎగువ బాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మండపాలు నిర్మించారు.

జల్ కుండ్ ప్రత్యేకం

ఈ దేవాలయం ఈశాన్య భాగంలో ‘జల్ కుండ్’ అని పిలిచే వాటర్ ట్యాంక్ ఉంది, ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు భావిస్తారు. ఈ ట్యాంక్ లో నీరు చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్స చేసే కొన్ని ఔషద లక్షణాలను కలిగి ఉండటం విశేషం. అప్పట్లో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో జీవిస్తుండేవారు. అదే సమయంలో స్వామి కృష్ణానంద..  శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని..అప్పటి నుంచీ  ఈ ప్రదేశంలో నీటి కొరతనేది లేదని చెబుతారు.
ఇక్కడ ఉండే  గుహలో శివుడు తపస్పు చేశాడని పురాణలు చెబుతున్నాయి.

మహాశివరాత్రి ఉత్సవాలు

ఈ పురాతన ఆలయంలో  ఏటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.  ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు స్థానికులు మాత్రమే కాదు, చుట్టు ప్రక్కల ప్రదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ మందిరం శిల్పకళా నైపుణ్యం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారంతా . ఇన్ని ప్రత్యేకతలున్న జటోలి శవాలయాన్ని దర్శించుకోవాలి అనుకుంటే రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సోలన్ నుంచి రోడ్డు మార్గంలో వెళితే 10 కిలోమీటర్లు, కల్కా రైల్వేస్టేషన్ నుంచి వెళితే 45 కిలోమీటర్లు,  చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 55 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు. జటోలి శివాలయం సమీపంలో ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలున్నాయి..అన్నిటి కన్నా కరోల్ టిబ్బా ట్రెక్కింగ్ మంచి అనుభూతినిస్తుంది.

Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!

మహా మృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం !
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ !!

Published at : 20 Sep 2023 07:09 AM (IST) Tags: Jatoli Shiv Temple Highest Temple In Asia Spirituality 39 Years Construction Time Lord Shiva Shiv Temple In Solan Himachal Pradesh

ఇవి కూడా చూడండి

Horoscope Today October 02, 2023: ఈ రాశివారు మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి, అక్టోబరు 2 రాశిఫలాలు

Horoscope Today October 02, 2023: ఈ రాశివారు మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి, అక్టోబరు 2 రాశిఫలాలు

TTD News: అక్టోబర్ 29న చంద్రగ్రహణం, 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూత

TTD News: అక్టోబర్ 29న చంద్రగ్రహణం, 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూత

Vastu Tips In Telugu: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!

Vastu Tips In Telugu: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!

Pitru Paksham 2023: మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!

Pitru Paksham 2023:  మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!

Pitru Paksham 2023: అక్టోబరు 14 వరకూ పితృ పక్షం - ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!

Pitru Paksham 2023:  అక్టోబరు 14 వరకూ పితృ పక్షం -  ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్