News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023: తొమ్మిది రోజుల పాటూ పూజలందుకున్న గణపయ్య కోలాహలంగా గంగమ్మ ఒడికి చేరుతాడు. ఇంతకీ పార్వతీ తనయుడి నిమజ్జనం వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా..!

FOLLOW US: 
Share:

Ganesh Nimajjanam 2023: ఒక్కో దేవతారూపాన్ని ఒక్కో తత్వానికి ప్రతీకగా చెబుతారు. వినాయకుడిని జల తత్వానికి ప్రతీక అంటారు. అందుకే ‘గంగాసుతాయ నమః’ అని వినాయకుణ్ని పూజిస్తారు.

ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశ్చైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః

ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరచిపోకుండా ఉండేందుకే ఏడాదికొకసారి మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. వినాయక పూజలో అంతరార్థం... కుడుములు, ఉండ్రాళ్లు పెట్టడం, భారీ విగ్రహాలను ప్రతిష్టించడం, పూనకం వచ్చినట్టు డాన్సులు చేయడం కాదు. మట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా ఉన్న లంబోదరుడిని శ్రద్ధతో పూజించడమే. అందుకే మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగు రంగుల విగ్రహాలు కాదు మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపాన్ని పూజించాలంటారు.

Also Read: మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

మట్టి భూమాతకు చిహ్నం

భూదేవికి మనసారా నమస్కరించి,భక్తితో మట్టిని తీసుకుని గణపతి ప్రతిమచేయాలి. వానాకాలం మొదలవడానికి ముందే చెరువులు, కుంటల్లో క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవలు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరుగుతుంది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుకున్న ఓ అంతరార్థం చెరువులు, కాల్వల పూడికతీయడం. గణనాథుడు ఇంట్లో అడుగుపెట్టక ముందే జలసిరులతో చెరువులు, కుంటలు కళకళలాడేవి.  

Also Read: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

పత్రిల ఉండే ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి

వినాయకుడిని 21 పత్రితో పూజిస్తారు. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే  పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. వాటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్య పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు లాంటిది. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలవడంతో వాటిలో ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించడమే కాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. 

వినాయకుడిని నిమజ్జనం చేయకపోతే

సాధారణంగా వినాయకచవితి రోజు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి వీలుని బట్టి 3,5,7,9,11,21 రోజుల పాటూ పూజలు చేసి గంగమ్మ ఒడికి చేరుస్తారు. మండపాల్లో విగ్రహాల సంగతి సరేకానీ..కొందరు ఇళ్లలో వినాయక ప్రతిమకు ఉద్వాసన చెప్పేసి పక్కనపెట్టేస్తారు నిమజ్జనం చేయరు. అయితే ఇలా ఉంచడం వల్ల ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదుకానీ.. విగ్రహాలు ఇంట్లో ఉంటే దాని పరిమాణానికి తగినంత నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. పైగా గణనాథుడు అంటే గణాలకు అధిపతి..అంటే ఆయన పరివారం చాలా పెద్దది. అలాంటి వినాయకుడికి నిత్యం చిన్న బెల్లం ముక్క, చిటికెడు పంచదార నివేదించి సంతృప్తి పరచలేరు. అందుకే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని పండితులు చెబుతారు.

గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ! స్వస్థాన పరమేశ్వర
యత్ర బ్రహ్మాదయో దేవ! తత్ర గచ్ఛ గణాధిపా॥

‘పరమేశ్వర స్వరూపుడవైన ఓ గణనాయకా ! మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, మా పూజలు అందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా! ఏ దేవలోకం నుంచి అయితే వచ్చావో, బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి వెళ్లిరమ్మ’ని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. 

మట్టిలో కలవాల్సిందే

భగవంతుడు తయారుచేసిన ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా చివరకు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలియజేస్తాడు గణనాథుడు. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లలో లయం చేయడం ద్వారా వచ్చిన చోటుకే చేరుకుంటాడన్నది తాత్వికార్థం. 

Published at : 27 Sep 2023 06:11 AM (IST) Tags: Lord Ganesh Ganesh Visarjan 2023 ganesh nimajjanam 2023 significance behind the immersion

ఇవి కూడా చూడండి

Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!

Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో  ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Horoscope Today  December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
×