Image Credit: Pinterest
Chanakya Niti In Telugu : ఓవ్యక్తి భౌతిక సంపదద్వారా ఉత్తముడు కాలేడు, ఖ్యాతి పెంచుకోలేడు. ఎన్ని చేతులు తనని ఆశీర్వదించాయన్నదానిపైనే ఆ వ్యక్తి ఔన్నత్యం బయటపడుతుంది. దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా..ఆ రూపంలో 8 మందిని మీ చుట్టూ ఉంచాడు. వాళ్లని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదన్నాడు చాణక్యుడు.
అమ్మ
దేవుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ తల్లిని పట్టించుకోనివారంతా కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. 9 నెలలు తన కడుపులో భద్రంగా దాచుకుని భూమ్మీద పడ్డాక కంటికిరెప్పలా కాపాడుకుంటూ..మీ క్షేమం కోసం తపించే నిస్వార్థ వ్యక్తి తల్లి. మృత్యువుతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిచ్చే తల్లిరుణం మీరు ఏం ఇచ్చినా తీర్చుకోలేరు..అందుకే రుణం తీర్చుకోపోయినా పర్వాలేదు కానీ అస్సలు అవమానించరాదు..
Also Read: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!
నాన్న
బిడ్డ పుట్టకముందునుంచే బాధ్యత కలిగిన వ్యక్తి తండ్రి. పిల్లల్ని పెంచి పెద్దచేసేందుకు, సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు పాటుపడతాడు. తండ్రి లేనిదే మీ పుట్టుక లేదు.. అలాంటి వ్యక్తిని దూషించడం, పట్టించుకోకుండా వదిలేయం చేస్తేవారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని, ఇంత కన్నా పాపం మరొకటి లేదని చెప్పాడు చాణక్యుడు.
గురువు
తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే. సమాజ ఉద్ధరణకు విద్య ఆయుధం లాంటిది. ఓ వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే అవసరం. మిమ్మల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారిని పొరపాటునైనా దూషిస్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. ఇలాంటి వారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు
మీ శ్రేయోభిలాషి
తల్లిదండ్రులే కాదు..మీకు విలువలు నేర్పించే వ్యక్తులు కొందరుంటారు. వారి మాటలు ఆచరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ శ్రేయోభిలాషులు ఇంట్లో వారు కావొచ్చు, చుట్టుపక్కల కావొచ్చు, బయటివారు కావొచ్చు... మంచి చెప్పినా చెవికి ఎక్కించుకోకుండా ధిక్కరించడం అంటే దేవుడిని అవమానించినట్టే అన్నాడు చాణక్యుడు
Also Read: చాణక్య నీతి : బుద్ధిమంతులు ఈ విషయాలను రహస్యంగా ఉంచుతారు!
మీకు భోజనం పెట్టిన వ్యక్తి
ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోందన్నది నిజమే కానీ ఆ డబ్బు అన్ని వేళలా ఆకలి తీర్చలేదు కదా. ఈ సత్యాన్ని ముందు గ్రహించాలన్న చాణక్యుడు..మీకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ దూషించరాదన్నాడు. మీ జీవితంలో శత్రువులు, స్నేహితులు చాలామంది ఉండొచ్చు కానీ...మీరు ఎవరన్నది కూడా తెలియకుండా ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం. అలాంటి వారికి గౌరవం ఇవ్వనివాళ్లు..దేవుడుని పూజించి ఏం లాభం..
స్నేహితుడు
స్నేహితుల్లో..ఉత్తములు ఉంటారు, అధములు ఉంటారు. ఎవరు ఏంటన్నది తెలుసుకోవాలి. కష్టకాలంలో వెన్నంటే ఉండే తండ్రిలాంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీకు తెలియకుండా కూడా దూషించకండి అన్నాడు చాణక్యుడు.
భార్య తల్లిదండ్రులు
చాలామంది మగవారు..తమ తల్లిదండ్రులకు పట్టం కడతారు కానీ.. భార్య తల్లిదండ్రులంటే మాత్రం చులకన భావంతో చూస్తారు. తల్లిదండ్రుల విలువ తెలిసిన వ్యక్తి, నిజంగా తల్లిదండ్రులను గౌరవించే వారు ఎప్పటికీ ఎవ్వరి తల్లిదండ్రులనూ దూషించలేరన్నాడు చాణక్యుడు. ఇలాంటి దూషణకు పాల్పడినవారిని దేవుడు కూడా క్షమించడని చెప్పాడు.
సంరక్షకులు
తల్లి, తండ్రి స్థానంలో సంరక్షకులుగా ఉంటారు కొందరు. వాళ్లు కూడా అహర్నిశలు మీ బాగుకోసం పాటుపడుతూ ఉంటారు. వారిపై విధేయత చూపాలి. లేదంటే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు..
ఈ ఎనిమిదిమందిని దూషిస్తే..స్వయంగా దైవ దూషణ చేసినట్టే అని బోధించాడు ఆచార్య చాణక్యుడు
Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!
Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు
Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!
Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>