By: ABP Desam | Updated at : 25 Sep 2023 11:49 AM (IST)
తెలంగాణ బీజేపీలో కీలక నేతల రహస్య సమావేశాలు ( Image Source : ABP Live )
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిపోతుంటే... రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మాత్రం అంతకంతకూ పడిపోతోంది. రాష్ట్ర బీజేపీ నేతల్లోనూ సఖ్యత కొరవడిందని సమాచారం. బీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కని కీలక నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మరికొందరు కూడా హస్తంతో చెయ్యి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచే కాదు.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. అంటే... తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరబోతున్నానా..? అంటే... జరుగుతున్న పరిణామాలు చూస్తే.. అవుననే అనిపిస్తోంది.
ఈటల రాజేందేందర్‌కు జాతీయ నాయకత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటి నుంచి బీజేపీలోని ఓ వర్గం రగిలిపోతోంది. ఈటల చెప్పడం వల్లే బండి సంజయ్‌ను కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నది వారి ఆరోపణ. ఈటలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు తగిన గుర్తింపు ఇవ్వకుండా అవమానిస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. తమను సంప్రదించకుండా... కొందరిని బీజేపీలో చేర్చుకోవడం కూడా వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. వారంతా బీజేపీ జాతీయ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేయకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టకపోవడం కూడా బీఆర్‌ఎస్‌కు ప్లస్‌గా మారుతుందని వారి అభిప్రాయం. దీనిపై అధిష్టానం పట్టించుకోవడంలేదన్నది.. అసంతృప్త వర్గం నేతల వాదన.
బీజేపీలోని ఆ అసంతృప్త నేతలంతా తరచూ రహస్య సమావేశాలు నిర్వహించడం.. హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రెండు, మూడు సార్లు సమావేశమైన నేతలు.. ఆదివారం నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో మీటింగ్ పెట్టకున్నారని సమాచారం. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావుతోపాటు పలువురు నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరంతా ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతోపాటు పార్టీ పెద్దలను కలిసి తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని భావిస్తున్నారట. జాతీయ నాయకత్వం అనుకూలంగా స్పందించకపోతే... తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. పార్టీ వీడేందుకు కూడా సిద్ధమే అన్న సంకేతాలను పార్టీ పెద్దలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
బీజేపీ అసంతృప్త నేతలంతా ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత... వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూసుకుని... అవసరమైతే కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. బీజేపీలోని కీలక నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని.. రాబోయే కాలంలో కాంగ్రెస్‌లోకి చేరికలు పెరుగుతాయని టీపీసీసీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయబోతోంది...? అసంతృప్తులను బుజ్జగిస్తుందా? లేదా... పోతేపోని అని వదిలేస్తుందా..? అనేది ఉత్కంఠగా మారింది.
Also Read: దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్ - రాహుల్‌గాంధీకి ఓవైసీ సవాల్
Also Read: అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం - ఏమేం పెడుతున్నారో తెలుసా?
Who is BRSLP Leader : ప్రతిపక్ష నేతగా కేటీఆర్‌కే చాన్స్ - కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావడం డౌటేనా !?
Telangana Result Effect On Andhra : తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీపై ఉంటుందా ? వైఎస్ఆర్‌సీపీ కంగారు పడుతోందా ?
BRS WronG campaign stratgy : కాంగ్రెస్‌పై అతి వ్యతిరేక ప్రచారమే కొంప ముంచిందా ? ప్రచార వ్యూహాలూ బీఆర్ఎస్‌కు ప్రతికూలం అయ్యాయా ?
Telangana Politics : వికటించిన వ్యూహాలు - కాంగ్రెస్ విజయానికి దోహదం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ !
Is Telangana BJP Happy : 8 సీట్లలో గెలిచిన బీజేపీ - ఇవి మెరుగైన ఫలితాలా ? ఎక్కడో ఉండాల్సిన పార్టీని అక్కడే ఉంచేసుకున్నారా ?
Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
/body>