అన్వేషించండి

ప్రత్యర్థులు ఎవరు? లెక్కలు వేసుకుంటున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

టికెట్ దక్కిన బీఆర్ఎస్ నేతలు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారని ఆరా తీస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రెడీ అవుతున్నాయి. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించేసింది. టికెట్ దక్కని నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దించింది. టికెట్ దక్కని నేతలకు నామినేటేడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తామని హామీలు ఇస్తోంది. పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచిస్తోంది. కొందరు నేతలు బుజ్జగింపులతో మెత్తబడినా మరికొందరు అలకవీడటం లేదు. 

టికెట్ దక్కిన బీఆర్ఎస్ నేతలు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారని ఆరా తీస్తున్నారు. వారి సామాజిక వర్గాలు ఏంటి ?ఎన్ని కోట్లు ఖర్చు చేయగలరు ? బలహీనతలు, బలాలను తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారి వివరాలు తెప్పించుకుంటున్నారు.  సన్నిహితులు, పార్టీ నేతల ద్వారా ప్రత్యర్థుల బ్యాక్ గ్రౌండ్ కనుక్కుంటున్నారు. వారి సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఏ ఏ గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయి ? అన్న అంశాలపై దృష్టి సారించారు. 

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పార్టీ తరపున పోటీ చేసే వారిని ప్రకటించకపోయినా బీఆర్ఎస్ మాత్రం ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.  కీడెంచి మేలు ఎంచాలన్న టార్గెట్ తో పని చేస్తున్నారు. గులాబీ బాస్ ఎన్నో ఆశలతో టికెట్ కేటాయించారని గెలిచి తీరాలన్న వ్యూహాలతో నేతలు ప్రచారం షూరూ చేసేశారు.  కాంగ్రెస్ క్యాండేట్ ను ఎలా ఇరుకున పెట్టాలి. బీజేపీని ఎలా దారిలోకి తెచ్చుకోవాలన్న అంశాలతో ఎజెండాను రెడీ చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలోకి రాకముందే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు మొదలు పెట్టేశారు. గ్రామాల వారీగా పార్టీ నేతలను పిలిపించుకొని ప్రత్యర్థి ఓట్ల శాతాన్ని తెలుసుకుంటున్నారు. 

ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే ఏం చేయాలి. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు  వచ్చిన ఓట్లు ఎన్ని వంటి వివరాలను బీఆర్ఎస్ క్యాండేట్లు సేకరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఫిక్సయిన తర్వాత దూకుడుగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఓటర్లకు ఇప్పటి నుంచే తాయిలాలు ప్రకటించేస్తున్నారు.  కుల సంఘాలు,ఉద్యోగ సంఘాలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.   బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న గ్రామాలపై నేతలు కాన్సట్రేట్ చేశారు. ప్రత్యర్థి పార్టీల సెకండ్ క్యాడర్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఏం కావాలో అన్ని చేసేస్తామని హామీలు ఇస్తున్నారు. నగదుతో పాటు కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. ఫ్యూచర్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
SRH VS DC IPL 2025:  స‌న్ రైజ‌ర్స్ న‌యా సంచ‌ల‌నం అనికేత్ వర్మ.. విధ్వంస‌క ఇన్నింగ్స్‌లతో ప‌వ‌ర్ హిట్టింగ్ కు కేరాఫ్ అడ్రస్ల
 స‌న్ రైజ‌ర్స్ న‌యా సంచ‌ల‌నం అనికేత్ వర్మ.. విధ్వంస‌క ఇన్నింగ్స్‌లతో ప‌వ‌ర్ హిట్టింగ్ కు కేరాఫ్ అడ్రస్ల
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
IPL 2025 SRH vs DC: 5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
Embed widget