అన్వేషించండి

Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?

Lebanon War Updates | ఇజ్రాయెల్ - లెబనాన్ ల మధ్య వైరం ఈనాటిది కాదు. అరబ్ దేశాలతో కలిసి ఇజ్రాయేల్ పై లెబనాన్ 1948 నుంచి 2024 వరకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

Israel War updates | మొన్న లెబనాన్ లో పేజర్లు పేలాయి... నిన్న వాకీటాకీలు.. ఇప్పడు లెబనాన్ లో బాంబులు పేలుతున్నాయి. ఇజ్రాయెల్ పై లెబనాన్ నుంచి హిజ్బుల్లా రాకెట్లతో దాడులు చేస్తోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య అసలు ఎందుకు వైరం ప్రారంభమైంది. ఆ కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

లెబనాన్ చరిత్ర ఇదే..
లెబనాన్ అంటే తెల్లని అనే అర్థం వస్తుంది. మంచుతో కప్పిన పర్వతాల వల్ల ఆ దేశానికి లెబనాన్ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ దేశాన్ని లెబనాన్ రిపబ్లిక్ గా పిలుస్తారు. అధికారిక భాష అరబ్బీ. మధ్యధరా తీర ప్రాంతంలో ఉన్న ఈ దేశానికి తూర్పు, ఉత్తర సరిహద్దులో సిరియా, దక్షిణ సరిహద్దుగా ఇజ్రాయెల్ దేశాలు ఉన్నాయి. ఈ దేశానికి క్రీస్తు పూర్వం 6 వేల నుండి 7 వేల సంవత్సరాల చారిత్రక ఆధారాలున్నాయి. ఈ దేశం ఈజిప్టు, అస్సీరియన్, అకెమెనిడ్,  రోమ్, సస్సీనియన్, ఓట్టోమన్ ఇలా చాలా సామ్రాజ్యాల పాలన కింద లెబనాన్ దేశం ఉంది. ఆ తర్వాత ఆధునిక చరిత్ర వచ్చే నాటికి చేతులు మారిన లెబనాన్ ఫ్రెంచ్ పాలకుల చేతుల్లోకి వచ్చింది. 1926 సెప్టెంబర్ 1వ తేదీన వారు లెబనాన్ రిపబ్లిక్ ను ఏర్పాటు చేశారు. 1946లో ఫ్రెంచ్ దళాలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయాయి. అప్పటి నుంచి బీరుట్ రాజధానిగా లెబనాన్ స్వతంత్ర దేశంగా ఉనికిలోకి వచ్చింది.

ఇజ్రాయెల్ – లెబనాన్ ల మధ్య వైరం ఏప్పటిది
1948 మే 14 వ తేదీన   ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ మరుసటి రోజే లెబనాన్ సహా ఈజిప్టు, సిరియా, జోర్డాన్, ఇరాక్ లు ఇజ్రాయెల్ పై యుద్దం ప్రకటించాయి. సరిద్దు దేశమైన లెబనాన్ కూడా ఈ యుద్దంలో తన చిన్న సైన్యంతో కలిసి  ఇజ్రాయెల్ పైకి వెళ్లింది. అయితే  ఒక దేశంగా ఏర్పడి ఒక్క రోజు గడవక ముందే   అరబ్ దేశాలు తమపై యుద్దానికి రావడంతో  ఇజ్రాయెల్ చాలా పట్టుదలతో యుద్దం చేసి  అరబ్ దళాలను  ఓడించింది. అంతే కాకుండా లెబనాన్ దక్షిణ సరిద్దున ఉన్న ఇజ్రాయెల్ దళాలు  ఆ సరిహద్దు ప్రాంతం దాటి దక్షిణ లెబానాన్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చాయి. అలా లెబనాన్ – ఇజ్రాయెల్ వార్ 1948 లలో ప్రారంభం అయింది. ఈ యుద్దంలో పైచేయి సాధించి లెబనాన్ ను  ఆక్రమించిన ఇజ్రాయెల్ ఆ తర్వాత  1949 మార్చి 23 జరిగిన  ఒప్పందంలో ఆ ప్రాంతాలను తిరిగి లెబనాన్ కు అప్పగించింది.

ఇజ్రాయెల్ తో సిక్స్ డే వార్ లో లెబనాన్
ఇజ్రాయెల్ – అరబ్  దేశాల చరిత్రలో 1967 జులై 5 నుండి జులై 11వ తేదీ వరకు జరిగిన ఆరు రోజుల యుద్దం అతి ముఖ్యమైన చారిత్రాత్మక ఘట్టం. అయితే ఈ యుద్దానికి కారణాలు వేరయినా లెబనాన్  అనివార్యంగా యుద్దంలో భాగమైంది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన 1948 నాటి కాలంలో అక్కడి నుండి  దక్షిణ లెబనాన్  లోకి వచ్చిన పాలస్తీనా శరణార్దులు, పాలస్తీనా  దేశం డిమాండ్ పేరుతో  ఇజ్రాయెల్ సరిహద్దుల్లో పోరాటం జరిపేవారు. ఈ తరహా హింసాత్మక ఘటనలు ఇజ్రాయెల్ కు లెబనాన్ కు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేశాయి. ఈ ఆరు రోజుల యుధ్దంలో లెబానాన్ సహా ఇతర అరబ్ దేశాలు ఓడిపోయాయి. ఈ యుద్దం తర్వాత లెబనాన్ పరిస్థితులు బాగా దిగజారాయి. పాలస్తీనా గ్రూపుల ప్రభావం  లెబనాన్ లో పెరిగింది. దీంతో ఆ  లెబనాన్ రాజకీయ పరిస్తితులన్నీ మారిపోయి అస్థిరతకు దారి తీసింది. పాలస్తీనా శరణార్థుల పెరగడంతో ఆర్థిక భారం ఎక్కువయింది.

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తో లెబనాన్ దోస్తీ...
 ఇజ్రాయెల్ కు కంట్లో నలుసుగా మారిన పాలస్తీనా  లిబరేషన్ ఆర్గనైజేషన్ తో  లెబనాన్  దోస్తీ కూడా ఇరు దేశాల ఉద్రిక్తతలను తారాస్థాయికి పెంచింది.  లెబనాన్ లో ఉన్న పాలస్తీనా శరణార్థులు సంఖ్య క్రమంగా పెరుగూతూనే ఉంది.   తమ దేశంలోని పాలస్తీనా  శరణార్థులు ఉండే దాదాపు 16 శిబిరాల పై నియంత్రణను పీఎల్ వోకు అప్పగించేందుకు లెబనాన్  ఆర్మీ  కమాండర్ ఎమిలే  బుస్తానీ -  పీఎల్ వో అధ్యక్షుడు యాసర్ అరాఫత్ మధ్య కైరో ఒప్పందం జరిగింది. దీంతో లెబనాన్ నుండి ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలను పీఎల్ వో నిర్వహించేందుకు లెబనాన్ అనుమతి ఇచ్చినట్లయింది. దీంతో ఇజ్రాయెల్ – లెబనాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త ఘటనలు ఆ తరువాతి కాలంలో చోటు చేసుకున్నాయి. 1973 లో  ఇజ్రాయెల్ దళాలు ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ పేరుతో లెబానాన్ బీచ్ లో పీఎల్ వో నేతలను మట్టుపెట్టింది. దీంతో  ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

Also Read: Israel-Hezbollah War: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు- 492 మందికిపైగా మృతి- ప్రజలకు నెతన్యాహూ తీవ్ర హెచ్చరిక

 లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..
లెబానాన్ నుండి ఇజ్రాయెల్ సరిహద్దుల్లో పీఎల్ వో దాడులను అడ్డుకునే లక్ష్యంతో  లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. 1982 జూన్ 6వ తేదీన జరిగిన ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం  లెబానాన్ రాజధాని బీరూట్ పశ్చిమ వైపు వరకు  సాగాయి.  అక్కడ  ఎక్కువగా పీఎల్ వో కార్యకలాపాలు ఎక్కువగా సాగడం వల్లే ఇజ్రాయెల్ బీరూట్ పశ్ఛిమ ప్రాంతంపై దాడులను తీవ్రం చేసింది. ఈ యుద్దం తర్వాత  పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్  లెబనాన్  నుండి వెనక్కి వెళ్లింది. సిరియా, ఇరాన్ ల జోక్యం లెబనాన్ లో పెరిగింది. క్రిస్టియన్స్, ముస్లిం ల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఇలా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి తో ఇరు దేశాల సంబంధాలు క్షీణించాయి. లెబనాన్  కూడా ఆర్థికంగా, రాజకీయంగా క్షీణించింది. అంతర్యుద్ధాలతో అట్టుడికిపోయింది.ఈ యుద్ధంలో పాల్గొనేందుకే అక్కడి మతాధికారులతో హిజ్బుల్లా అనే సంస్థ ఏర్పాటయింది. ఇవాళ ఇజ్రాయెల్ కు కంట్లో కునుకు లేకుండా చేస్తున్న సంస్థే హిజ్బుల్లా.

లెబనాన్ – ఇజ్రాయెల్ మధ్య ఘర్షణకు మరి కొన్ని కారణాలు
ఇజ్రాయెల్  సెక్యూరిటీ రీజన్స్ పేరుతో తన సరిహద్దుల్లో ఉన్న లిటాన్ నది నీటిని దక్షిణ లెబనాన్ కు ఇవ్వకుండా ఆపివేసింది. ఇక్కడ పాలస్తీనా తీవ్రవాద గ్రూపులు అధికంగా ఉన్నాయని, మిలటరీ చర్యలను నిరోధించేందుకు, నదిపై తన నియంత్రణ కోసం ఇజ్రాయెల్ ఈ చర్యలు తీసుకుంది. ఇలా దక్షిణ లెబనాన్ పై 2000 సంవత్సరం వరకు ఇజ్రాయెల్ ఆధిపత్యం సాగించింది.

1993 సెవన్ డే వార్..
ఇది ఇజ్రాయెల్- హిజ్బుల్లాల మధ్య జరిగింది. 1993 ఏప్రిల్ 11 వ తేదీ నుండి 27వతేదీ వరకు జరిగింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన సైనికులను హిజ్బుల్లా చంపడం ఈ వార్ కుకారణం.  ఈ యుద్దంలో  అస్థి నష్టం చాలా మంది లెబనాన్ పౌరులు మరణించారు.

1996 ఆపరేషన్ గ్రేప్ ఆఫ్ వ్రాత్ ....
ఇజ్రాయెల్ – లెబనాన్ సరిహద్దుల్లో జరిగిన  ఇరు వర్గాల పోరాటం వల్ల ప్రాణ నష్టం జరిగింది. దీంతో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ ఆపరేషన్ గ్రేప్ ఆఫ్ వ్రాత్ పేరుతో సైనిక దాడికి దిగింది. 1996 ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు  ఇది ఆపరేషన్ గ్రేప్ ఆఫ్ వ్రాత్ జరిగింది.  ఇజ్రాయెల్ వైమానిక దాడులు,  బాంబు షెల్స్ తో లెబనాన్ దద్దరిల్లింది. ఏప్రిల్ 27వ తేదీన ఇజ్రాయెల్ – హిజ్బుల్లాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో    ఈ యుద్దం ముగిసింది. లెబనాన్ లో చాలా ప్రాణ, ఆస్థి నష్టాన్ని మిగిల్చింది. ఆపరేషన్ గ్రేప్ ఆఫ్ వ్రాత్.

2006 సైనిక ఘర్షణ...
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన హిజ్బుల్లా  ముగ్గురు సైనికులను చంపి ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను కిడ్నాప్ చేసింది. లెబనాన్ ఖైధీల విడుదల కోసం హిజ్బుల్లా ఈ ప ని చేయడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున లెబనాన్ నగరాలపై దాడికి దిగింది. దాదాపు వేయికి పైగా ప్రజలు చనిపోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.  ఓ రకంగా చెప్పాలంటే ఇరుదేశాల మధ్య జరిగిన పెద్ద యుద్ధంగా దీన్ని చెప్పవచ్చు.

2024 యుద్దం ఎక్కడికి దారి తీస్తుందో..
2006 నుండి ఇరు దేశాల మధ్య చిన్న చిన్న ఘర్షణలు జరిగినా రెండు దేశాల మధ్య పెద్ద ఉద్రిక్తలు చోటు చేసుకోలేదు.  అయితే పాలస్తీనా తీవ్రవాద గ్రూపులు గత ఏడాది ఇజ్రాయెల్ పై దాడి చేయడం అందుకు ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత రంగంలోకి  లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా దిగింది. దీంతో ఇప్పుడు  ఇజ్రాయెల్ సైతం లెబనాన్ పై పూర్తి స్థాయి యుద్దం చేస్తోంది. ఇలా రెండు దేశాల మధ్య వైరం ఇనాటిది కాదు.  ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన నాటి నుండి ఈ విరోధం కొనసాగుతూనే ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
YSRCP On Tirumala Laddu: తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Embed widget