అన్వేషించండి

Israel Hezbollah Conflict: ఇజ్రాయెల్ రక్షణకు ఎన్ని రకాల దళాలు పని చేస్తాయి, వాటి పనితీరు తెలిస్తే షాక్

Israel Conflict: ఇజ్రాయెల్ దేశంగా ఆవిర్భవించిన నాటి నుంచి అంతర్గతంగా, అరబ్ దేశాల నుంచి భద్రతా సవాళ్లు ఎదుర్కొంటోంది. వాటని ఎదుర్కొనేందుకు పటిష్టమైన రక్షణ దళాలను ఏర్పాటు చేసుకుంది.

Israel Hezbollah Conflict Live Updates: ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ లోని అతి చిన్న దేశం. చుట్టూ శత్రు దేశాలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవడం అత్యంత క్లిష్టమైన సవాల్ గా మారుతుంది. ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడిన మరుసటి రోజే యుద్దం చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి అరబ్ దేశాల మధ్య ఇజ్రాయెల్ అంతర్గతంగా, బహిరంగంగా సైనిక సవాళ్లను ఎదుర్కొంటుంది. అలాంటి ఇజ్రాయేల్ ఎలాంటి రక్షణ వ్యవస్థలను కలిగి ఉందో ఇప్పుడు చూద్దాం.

 ఇజ్రాయెల్ రక్షణ కోసం పలు రకాల దళాలు పని చేస్తాయి. అంతర్గతంగా ఎదురయ్యే భద్రతా సవాళ్లు, బయట దేశాల నుండి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు  అవసరమైన దళాలను ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఇందులో ముఖ్యమైన రక్షణ దళం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇందులో మూడు ముఖ్యమైన విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలేంటంటే.

  1. ఇజ్రాయెల్ పదాతి దళాలు ( ISREAL GROUND FORCES)- ఈ ఫోర్సెస్ భూమి మీద జరిగే యుద్దాలకు వాడే దళాలు. ప్రస్తుతం గాజాలో భూతల యుద్ధం చేస్తోంది ఐడీఎఫ్ లోని ఈ గ్రౌండ్ ఫోర్సెస్.
  2. ఇజ్రాయెల్ వైమానిక దళం (ISRAELI AIR FORCES) - ఇజ్రాయెల్ గగనతల రక్షణతో పాటు, ఇతర శత్రు దేశాలపై గగనతల యుద్దం చేయాడానికి, గ్రౌండ్ ఫోర్సెస్ కు సాయపడటానికి ఐఏఎఫ్ పని చేస్తుంది. ప్రస్తుతం గాజాలోనూ, లెబనాన్ లోను ఐ.ఎ.ఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
  3. ఇజ్రాయెల్ నౌకాదళం ( ISRAELI NAVY FORCES) - ఈ విభాగం ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న సముద్రతల భద్రతను, రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.

పై మూడు విభాగాలు  ఇజ్రాయెల్ రక్షణలో కీలకంగా పని చేస్తాయి.  ఈ దళాలు దేశ  భద్రత, రక్షణ చర్యల్లో పని చేసే ఫ్రంట్ ఫోర్సెస్ అని చెప్పాలి. ఇక వీరితో పాటు మిలిటరీ ఇంటలిజెన్స్, సైబర్ డిఫెన్స్ యూనిట్స్ వీరి రక్షణ వ్యవస్థలో కీలకంగా పని చేస్తాయి.

దేశ అంతర్గత భద్రత కోసం పని చేసే దళాలు ఇవే...

దేశం వెలుపల  యుద్దాలకు పనిచేసే ఐడీఎఫ్ అందులోని అంతర్గత దళాల పని తీరు తెలుసుకున్నాం. ఇప్పుడు దేశంలో లోపల అంతర్గత భద్రత కోసం మరి కొన్ని దళాలను ఆ దేశం ఏర్పాటు చేసుకుంది. దేశం చుట్టూ శత్రువులే ఉన్నాయి. ఇక పక్కనే పాలస్తీనా తీవ్రవాదులతో నిత్యం  అతర్గతంగా సవాళ్లు ఎదురవుతుంటాయి. ఎప్పుడైనా ఎక్కడైనా తీవ్రవాదుల బాంబులకు, ఆత్మాహుతి దాడులను ఎదుర్కోవల్సిన పరిస్థితి ఇజ్రాయెల్ దేశానిది. వీటి నుంచి ఇజ్రాయెల్ పౌరులను కాపాడటానికి వివిధ రకాల భద్రతా సంస్థళు పని చేస్తున్నాయి. ఇవి దేశ ప్రజలను, సరిహద్దులను. ప్రభుత్వ సంస్థల రక్షణే ధ్యేయంగా పని చేస్తాయి.

  1. షిన్ బెట్ – ( ISRAEL SECURITY AGENCY). ఈ సంస్థ ప్రధాన విధి దేశంలో అంతర్గత భద్రతను చూసుకోవడం. దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసిరే తీవ్ర వాద చర్యల ఉనికిని పసిగట్టి అడ్డుకుంటుంది. దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసిరే సంస్థలు, వ్యక్తుల ను గుర్తించి  సమాచారం సేకరించడం, దేశ వ్యాప్తంగా తనదైన శైలిలో గూఢాచార్యం నిర్వహించి రక్షణ చర్యలు తీసుకోవడం ప్రధాన విధులు.

  2. మగావ్ (Magav) - బోర్డర్ పోలీస్: ఇది మన దేశంలో బీఎస్ఎఫ్ ఎలానో అలా ఇజ్రాయేల్ దేశంలో  దేశ సరిహద్దుల్లో భద్రత ఏర్పాట్లు చూస్తుంది. దేశ సరిహద్దుల నుండి వచ్చే సవాళ్లను ఎదుర్కొంటుంది. చుట్టూ శత్రు దేశాల సరిహద్దులు ఉండటంతో అక్కడి వారు రాకుండా, తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా దేశ అంతర్గత  భద్రతకు ముప్పు ఏర్పడకుండా ఈ ప్రత్యేక దళం పని చేస్తుంది. సరిహద్దుల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ మగావ్ దళం ముఖ్య విధి అని చెప్పాలి.

  3. ఇజ్రాయెల్ పోలీస్ ఫోర్స్ (Israel Police): ఇది మన పోలీసుల్లానే దేశ వ్యాప్తంగా ఆ దేశ చట్టాలు అమలు, నేరాల నియంత్రణ, క్రిమినల్స్ ను పట్టుకుని న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షలు పడేలా చేయడం వీరి ప్రధాన విధి. ప్రజల రక్షణ అనేది  ఇజ్రాయెల్ పోలీసుల ప్రధాన విధి.

  4. సరిహద్దు భద్రత దళాలు (Border Protection Units): ఈ దళాలు ముఖ్యంగా వివాదస్పద సరిహద్దు ప్రాంతంలో గస్తీ కాస్తుంటాయి. మనకు పాకిస్థాన్, బంగ్లా సరిహద్దుల్లో ఎలా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయో.. అలాగే సిరియా, లెబనాన్, పాలస్తీనా సరిహద్దుల్లో ఇవి పని చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత సున్నితమైన ప్రాంతాలు, ఉద్రిక్త పరిస్థిలు ఉండే గాజాస్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ఏరియాల్లో ఈ దళాలు కీలక పాత్ర పోషిస్తాయి.

 ఇక ఆ దేశంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అత్యంత శక్తవంతమైన ప్రత్యేక కార్యాచరణ దళం. మొస్సాద్.

మొస్సాద్ -   ఇజ్రాయెల్ దళాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మొస్సాద్ కోసమే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూడాఛార దళం మొస్సాద్. మనకు రా అంటే రిసెర్ట్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) ఎలానో.. మొస్సాద్ ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ. దేశంలోపల, వెలుపల ఎన్నో  ఆపరేషన్లు నిర్వహించి సక్సెస్ ఫుల్ గూఢాచార సంస్థగా ప్రపంచంలో గుర్తింపు పొందింది. మొస్సాద్ ప్రధాన విధి విదేశాల్లో గూఢచార్యం నిర్వహించడం. ఇజ్రాయెల్ కు ముప్పుగా పరిమణించే దేశాలను, వ్యక్తులను, సంస్థలను, తీవ్రవాద సంస్థలను, ఆర్థిక సంస్థలను, సాంకేతిక సంస్థలను టార్గెట్ చేస్తూ పని చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మొస్సాద్ ఏజెంట్లు పని చేస్తారు. దేశ భధ్రతే వీరి ప్రధాన విధిగా చెప్పాలి.

ఇలా  అంతర్గత భద్రత విషయంలో ఇజ్రాయెల్ ఎంత మాత్రం రాజీ పడని దేశంగా పేరు పొందింది. తమ దేశానికి, దేశ వాసులకు  ఏదైనా ముప్పు వాటిల్లుతుందని సమాచారం వస్తే  ఖండాలు దాటైనా వారి భద్రతా దళాలు స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించి ఆ ముప్పును కలిగించే సంస్థలను న్యూట్రలైజ్ చేస్తాయి. వ్యక్తులైతే మట్టుపెడతాయి. అందుకే ఇజ్రాయెల్ దళాలంటే ప్రపంచంలోని రక్షణ దళాల్లో ప్రత్యేకమైన దళాలుగా గుర్తింపు పొందాయనడంలో సందేహం లేదు. అసాధ్యమైన, సాహసోపేతమైన ఆపరేషన్లు నిర్వహించిన ఘనత వీరి సొంతం. హాలివుడ్ సినిమాలను తలపించే  మిలటరీ ఆపరేషన్లు చేసిన చరిత్ర ఇజ్రాయెల్ దళాలది.

Also Read: Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు
Tirupati Laddu Row: జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం- శాంతియుత నిరసనకు పిలుపు
జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం- శాంతియుత నిరసనకు పిలుపు
Tirumal Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం
తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం
Devara: 'దేవర' థియేటర్‌లో అగ్ని ప్రమాదం... హద్దులు దాటిన అభిమానంతో కాలిపోయిన తారక్ భారీ కటౌట్
'దేవర' థియేటర్‌లో అగ్ని ప్రమాదం... హద్దులు దాటిన అభిమానంతో కాలిపోయిన తారక్ భారీ కటౌట్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు
Tirupati Laddu Row: జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం- శాంతియుత నిరసనకు పిలుపు
జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం- శాంతియుత నిరసనకు పిలుపు
Tirumal Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం
తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం
Devara: 'దేవర' థియేటర్‌లో అగ్ని ప్రమాదం... హద్దులు దాటిన అభిమానంతో కాలిపోయిన తారక్ భారీ కటౌట్
'దేవర' థియేటర్‌లో అగ్ని ప్రమాదం... హద్దులు దాటిన అభిమానంతో కాలిపోయిన తారక్ భారీ కటౌట్ 
Jagan Tirumala tour controversy : హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
Love Sitara Movie Review - 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
Karimnagar: ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!
ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!
Devara Movie Review - దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
Embed widget