By: Ram Manohar | Updated at : 21 Sep 2023 05:13 PM (IST)
ఖలిస్థాన్ వివాదంతో కెనడాతో భారత్ మైత్రి సందిగ్ధంలో పడిపోయింది.
India-Canada Relations:
పెరుగుతున్న ఉద్రిక్తతలు
భారత్ కెనడా మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు ఎంత త్వరగా తగ్గితే అంత మంచిదని అంటున్నారు నిపుణులు. అందుకు కారణం లేకపోలేదు. భారత్‌కి కెనడా అవసరం ఎంత ఉందో..కెనడాకి భారత్ అవసరం అంత కన్నా ఎక్కువగానే ఉంది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ఆ వ్యాఖ్యలు చేయకపోయుంటే అంతా బాగానే ఉండేది. కానీ ఇలా భారత్‌ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడమే ఉద్రిక్తతలను పెంచింది. ఇప్పుడు ఏకంగా వీసాలు ఆపేంత వరకూ వచ్చింది. ఖలిస్థాన్ ఉద్యమానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని కెనడా ఇంటిలిజెన్స్ అందించాలని భారత్ కోరుకుంటోంది. ఈ విషయంలో కెనడా నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు లభించకపోవడం అతి పెద్ద సవాలుగా మారింది. ఇటు భారత్ కేవలం కెనడాపైనే ఆధారపడకుండా యూకే, యూఎస్, ఆస్ట్రేలియా సాయం తీసుకుంటోంది. Sikhs for Justice’ (SFJ) నెట్‌వర్క్‌పై ఆరా తీస్తోంది. ఖలిస్థాన్ సానుభూతి పరులు ఎక్కడెక్కడ ఉన్నారో లెక్కలు తీస్తోంది. కెనడా అంత బహిరంగంగా భారత్‌పై ఆరోపణలు చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది భారత్. అందుకే చాలా గట్టిగా బదులివ్వాలని చూస్తోంది. సిక్కుల కమ్యూనిటీ ఓటు బ్యాంకుని కోల్పోకుండా కేవలం పొలిటికల్ గెయిన్ కోసం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారన్నది కాదనలేని నిజం. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్న ఆ డిమాండ్‌కి ట్రూడో పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టే భావించాల్సి వస్తోంది. కానీ...ట్రూడో కేబినెట్‌లో చాలా మంది ఇండియాకి మద్దతుగా నిలుస్తున్నారు. భారత్ వైపు నుంచి ఆలోచించాల్సిన అవసరముందని హితబోధ చేస్తున్నారు. ట్రూడో మాత్రం వీటిని లెక్క చేయడం లేదు.
మాజీ హైకమిషనర్ ఏం చెప్పారంటే..?
మాజీ హైకమిషనర్ ఆఫ్ ఇండియా గాయత్రి ఇస్సార్ కుమార్ ( Gaitri Issar Kumar) ఈ వివాదంపై ABP Newsతో ప్రత్యేకంగా మాట్లాడారు. కెనడా పార్లమెంట్‌లో ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యల్ని కచ్చితంగా ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు. కెనడాలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయని ఆధారాలతో సహా బయటపెట్టినా ఇప్పటి వరకూ ఆ సమస్యను కెనడా పట్టించుకోలేదని వెల్లడించారు.
"కెనడా పార్లమెంట్ వేదికగా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాల్సిందే. గతంలో భారత ప్రభుత్వం చాలా సార్లు కెనడాకి హెచ్చరికలు చేసింది. ఆ దేశంలో యాంటీ ఇండియా ఉద్యమాలు జరుగుతున్నాయని ఆధారాలతో సహా ఇచ్చింది. అయినా కెనడా పట్టించుకోలేదు. కెనడా సహా పలు దేశాల్లో ఖలిస్థాన్ ఉద్యమానికి పరోక్షంగా మద్దతు లభిస్తోంది. అలా అని ఆ దేశాలన్నింటితోనూ సంబంధాలు తెంచుకోలేం కదా"
- గాయత్రి ఇస్సార్ కుమార్, యూకే మాజీ హైకమిషనర్ ఆఫ్ ఇండియా
1980ల నుంచే యాక్టివ్‌గా..
1980ల నుంచే కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదం మొదలైందని వెల్లడించారు గాయత్రి కుమార్. అయితే...కెనడా సెక్యూరిటీ ఏజెన్సీలు భారత్‌కు కొంత మేర సహకారం అందిస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు జరిగినట్టు వివరించారు. ఇక్కడే ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించాలి. రెండు దేశాల మధ్య న్యూక్లియర్ అగ్రిమెంట్ ఉంది. కెనడా నుంచి దాదాపు 50% మేర పప్పు దినుసులు భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఉచిత వాణిజ్య ఒప్పందాలపైనా రెండు దేశాలు సంతకాలు చేశాయి. భద్రతా పరంగానూ రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కెనడా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించినప్పుడు దీనిపై చర్చ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కెనడా ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదముంది. ఇదే విషయాన్ని వెల్లడించారు గాయత్రి ఇస్సార్ కుమార్.
"భారత్‌కి సంబంధించిన భద్రతా పరమైన అంశాలపై కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదు. అక్కడ ఈ మధ్య జరిగిన ఘటనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. రెండు దేశాల మధ్య ఉన్న సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ కచ్చితంగా దౌత్యపరంగా సమస్య పరిష్కరించుకుంటుందని నమ్ముతున్నాను. అటు కెనడా కూడా భారత్ సమస్యల్ని అర్థం చేసుకుని సహకరిస్తుందని భావిస్తున్నాను"
- గాయత్రి ఇస్సార్ కుమార్, యూకే మాజీ హైకమిషనర్ ఆఫ్ ఇండియా
Also Read: కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస
SSC Delhi Police: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
/body>