2024 పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ శక్తిని తయారుచేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2014కు ముందు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రస్తుతం మనుగడలో లేదన్నారు దీదీ. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ తర్వాత మమతా కీలక వ్యాఖ్యలు చేశారు.
పవార్ ఏమన్నారంటే?
మమతా బెనర్జీతో భేటీని శరద్ పవార్ కీలకమైన సమావేశంగా పేర్కొన్నారు. భాజపాను ఎదుర్కొనేందుకు భావసారుప్యత కలిగిన పార్టీలు కలిసిరావాలని కోరారు.
పీఎం పీఠం..
బంగాల్‌లో హ్యాట్రిక్ విజయం సాధించిన మమతాబెనర్జీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈసారి టార్గెట్ 2024 అంటూ సంకేతాలు ఇస్తున్నారు. బంగాల్ లో ఓటర్లు ఇచ్చిన జోష్‌తో దిల్లీ కోటలను బద్దలు కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో భాజపాను ఎదుర్కొని ముఖ్యంగా మోదీ-షా ద్వయాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఏ పార్టీకి లేదన్నది విశ్లేషకుల మాట. అయితే కాంగ్రెస్‌కు ఆ శక్తి ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో దీదీపై దేశవ్యాప్త ప్రజాదరణ ఉందని, మోదీని ఎదుర్కొనే సత్తా ఆమెకే ఉందని దాదాపు అన్ని విపక్ష పార్టీలు అంగీకరిస్తున్నాయి. తాజాగా జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చూపిన తెగువే ఇందుకు సాక్ష్యం.
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
Also Read: Worlds Expensive City: ఈ నగరం చాలా కాస్ట్‌లీ!.. వెళ్తే జేబులో డబ్బులు ఖాళీ!
Also Read: Omicron Travel Rules: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!
Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్
Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు