Vice President Election 2022 Live: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ షురూ- జగదీప్ ధన్‌ఖడ్ Vs మార్గరెట్ అల్వా
Vice President Election 2022 Live Updates: భారత ఉపరాష్ట్రపతి కోసం పోలింగ్ మొదలైంది. పార్లమెంటు భవనంలో ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

Background
Vice President Election 2022 Live: భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఎన్‌డీఏ తరఫున బంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ (71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి మార్గరెట్ అల్వా (80) బరిలో నిలిచారు. ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఉదయం 10 గంటలకు మొదలైంది. సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంటు భవనంలో పోలింగ్ కొనసాగనుంది.
లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్ముకశ్మీర్ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది.
ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనేఅవకాశం ఉంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు.
అయితే జగదీప్ ధన్‌ఖడ్ విజయం లాంఛనమే అనిపిస్తోంది. ఎన్‌డీఏతో పాటు పలు పార్టీలు ధన్‌ఖడ్‌కు మద్దతు పలకడంతో ఆయన గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
ప్రొఫైల్
- జగదీప్ ధన్‌ఖడ్ రాజస్థాన్‌లోని ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు.
- చిత్తోడ్‌గఢ్ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
- రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు.
- రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. కిసాన్‌పుత్ర అనే గుర్తింపు సాధించారు.
- ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు ధన్‌ఖడ్.
- రాజస్థాన్ హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు.
- రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు.
ప్రమాణస్వీకారం
కొత్త ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు.12వ తేదీవరకు పార్లమెంటు జరుగనున్నందున చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు
- ఎన్నికల నోటిఫికేషన్: జులై 7
- నామినేషన్లకు చివరి రోజు: జులై 19
- నామినేషన్ల పరిశీలన: జులై 20
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 22
- పోలింగ్, ఫలితాలు: ఆగస్ట్ 6
ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం పూర్తి కానుంది.
కాంగ్రెస్ ఎంపీల ఓటు
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జైరాం రమేశ్, మల్లిఖార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌధురీ, కే సురేశ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Delhi | Congress MPs Shashi Tharoor, Jairam Ramesh, Mallikarjun Kharge, Adhir Ranjan Chowdhury, and K Suresh cast their votes for the Vice Presidential election. pic.twitter.com/IqzkaGo9e4
— ANI (@ANI) August 6, 2022
హేమమాలిని ఓటు
భాజపా ఎంపీ హేమ మాలిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
BJP MP Hema Malini casts her vote for the Vice Presidential election, at the Parliament in Delhi. pic.twitter.com/4wQyDFL5My
— ANI (@ANI) August 6, 2022



















