Budget 2024: వికసిత్ భారత్ లక్ష్యానికి తగ్గట్టుగా ఉంది - నిర్మలమ్మ పద్దుపై ప్రధాని ప్రశంసలు
Interim Budget 2024: వికసిత్ భారత్ లక్ష్యానికి ఈ బడ్జెట్ బాటలు వేసేలా ఉందని ప్రధాని మోదీ ప్రశంసించారు.
Interim Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈ పద్దు ఉందని కొనియాడారు. మూలధన వ్యయం (capital expenditure) రికార్డు స్థాయిలో రూ. 11,11,111 కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్రవ్యలోటుని గమనిస్తూనే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని వెల్లడించారు. దీన్నే ఆయన Sweet Spotగా అభివర్ణించారు. ఈ బడ్జెట్ ద్వారా ఎన్నో ఉద్యోగావకాశాలూ లభిస్తాయని స్పష్టం చేశారు.
#WATCH | On Union Interim Budget 2024-25, PM Narendra Modi says, "In this budget, keeping fiscal deficit under control, capital expenditure has been given a historic high of Rs 11,11,111 Crore. If we speak the languages of the economists, in a manner this is 'sweet spot'. With… pic.twitter.com/kU2mpUrm0i
— ANI (@ANI) February 1, 2024