Telugu News Today: బీఆర్‌ఎస్‌కు షాక్ - రేపు బీజేపీలోకి ఎంపీ రాములు!
నాగర్‌కర్నూల్‌ ఎంపీ, బీఆర్ఎస్ నేత పోతుగంటి రాములు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రేపు ఆయన బీజేపీలో చేరబోతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల తనకు ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని ఎంపీ రాములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆయన తాజాగా బీజేపీలో చేరడానికి ఆసక్తి కనబర్చారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై క్లారిటీ, కీలక ప్రస్తావన చేసిన మాగుంట!
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎట్టకేలకు వైసీపీకి రాజీనామా చేశారు. గడచిన కొన్నాళ్ల నుంచి వైసీపీతో అనుబంధాన్ని తెంచుకున్న ఆయన.. బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీని వీడుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే తన రాజకీయ భవిష్యత్, రాజకీయ వారసుడికి సంబంధించిన కీలక ప్రకటనను ఆయన చేశారు. ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చేందుకు వైసిపి అధిష్టానం అంగీకరించలేదు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'అన్నదాత బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి' - వైఎస్సార్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. అందుకే ప్రభుత్వం వేసే ప్రతీ అడుగులోనూ అన్నదాతకు అండగా నిలిచామని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. బుధవారం వైఎస్సార్ రైతు భరోసా (Rythu Bharosa) పెట్టుబడి సాయం సొమ్మును.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే, రబీ 2021 - 22, ఖరీఫ్ - 2022 సీజన్లకు గానూ అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. 'రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణకు ప్రధాని మోదీ, ఈసారి రెండు రోజుల టూర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మోదీ వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ మార్చి 4వ తేదీన.. అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్చి 5న సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మోదీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా, మోదీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


బండి సంజయ్‌పై కోడి గుడ్లతో దాడి, పోలీసులపై ఆగ్రహం
బండి సంజయ్‌ పై కోడిగుడ్లతో దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్నారు. వంగరలో యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు. ఈ దాడితో అసహనం చెంది బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీసు బందోబస్తు ఏం వద్దని.. మీరు వెళ్లిపోండి.. అంటూ పోలీసులపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కోడిగుడ్ల దాడితో అసహనం చెంది పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దు.. మీరు వెళ్లిపోవాలని చెప్పిన బండి సంజయ్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి