Modi Telangana Tour in Adilabad Sangareddy Districts: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మోదీ వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ మార్చి 4వ తేదీన.. అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్చి 5న సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మోదీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా, మోదీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు సమాచారం. మరోవైపు మార్చి 4న తెలంగాణలో జరగాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది.
షెడ్యూల్ ఇదీ
మార్చి 4న ఉదయం పదిన్నర నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్‌లో కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తారు. 11.15 గంటల నుంచి 12 గంటల వరకు ఆదిలాబాద్ లోనే బహిరంగ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికల్లా హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేస్తారు. ఈలోపు బీజేపీ నాయకులతో సమావేశాలు ఉంటాయి.
మార్చి 5న సంగారెడ్డిలో పర్యటన ఉండనుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ నుంచి బయలుదేరి ఉదయం 10.45 నుంచి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఉదయం 11.30 నుంచి 12.15 వరకు సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. దాంతో ప్రధాని పర్యటన తెలంగాణలో ముగుస్తుంది. అనంతరం ప్రధాని ఒడిషా వెళ్లనున్నట్లు తెలిసింది.