వైజాగ్‌లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం- విజన్ విశాఖ సదస్సులో జగన్ కీలక వ్యాఖ్యలు - విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైజాగ్ నుంచే పాలన చేపడతామన్నారు. మళ్లీ గెచిన తర్వాత వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అదే తన కమిట్‌మెంట్ అంటూ కామెంట్ చేశారు. విశాఖలో విజన్ విశాఖ సదస్సు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఓప్రైవేటు హోటల్‌లో రెండు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. మొదటి రోజు సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ వైజాగ్ వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే వైజాగ్ చాలా త్వరగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు జగన్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
శిలలా మారిన జగన్‌కు ధనుంజయ్, సజ్జల చెప్పిందే వినిపిస్తుంది- జగన్‌పై మంత్రి సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ సీనియర్ లీడర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 12 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోసాను. పార్టీలో కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యే ,మంత్రిని అయ్యాను. నా వ్యక్తిగత నిర్ణయం మేరకు రాజీనామా చేస్తున్నా. మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నా. చంద్రబాబు సమక్షంలో జైహొ బిసి సభలో టీడీపీలో జాయిన్ అవుతున్నాను. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు పార్టీని వీడుతున్నాను. నేను ఎప్పుడు తప్పు చేయలేదు. నాకు సహకారం లేదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ సమావేశం- ఎంపీ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నానని అందుకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్ పోటీ చేయకుండా నేరుగా తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పటాన్ చెరులో రూ. 7 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం- జాతికి అంకితం చేసిన ప్రధాని
తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. రెండోరోజు తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంగారెడ్డిలో పర్యటించి పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నాపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వండి- డీజీపీ, వివిధ దర్యాప్తు విభాగాలకు చంద్రబాబు లేఖ
వారం పదిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ నామినేషన్లు వేసేందుకు నేతలు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా తనపై నమోదు అయిన కేసుల వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లెటర్ రాశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఆయన రాసిన లేఖ వివరాలు యథాతథంగా... కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో ప్రజాసమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి