మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భీమా' (Bhimaa Movie). మార్చి 8 (శుక్రవారం) థియేటర్లలో విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ 10 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించింది. సినిమాపై అంచనాలు పెంచింది. అయితే... ట్రైలర్ రిలీజ్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన 'అఖండ'తో కంపేరిజన్స్ వచ్చాయి. సినిమా విడుదల సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు గోపీచంద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన దగ్గర కంపేరిజన్స్ గురించి ప్రస్తావించగా... 


'అఖండ'తో పోలిస్తే మంచిదే! కానీ...
''మా సినిమాను 'అఖండ'తో కంపేర్ చేస్తున్నారా? అలా పోలిస్తే మంచిదే కదా! కానీ, మా సినిమాకు, 'అఖండ'కు కథ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రెండూ వేర్వేరు సినిమాలు'' అని గోపీచంద్ చెప్పారు.


అసలు 'అఖండ'తో ఎందుకు కంపేర్ చేశారు?
Bhimaa Trailer Review: 'భీమా' ట్రైలర్ గమనిస్తే... పరశు రాముని క్షేత్రంలో కొంత మంది రాక్షసులను అంతం చేయడానికి బ్రహ్మ రాక్షసుడు వచ్చాడని వాయిస్ ఓవర్ వస్తుంది. గోపీచంద్ పోలీస్ రోల్ చేశారు. దాంతో పాటు మరో గెటప్‌లోనూ కనిపించారు. పరశు రాముని క్షేత్రంలో అఘోరాలు ఉన్నారు. ఆ మహా శివుని ప్రస్తావన ఉందన్నట్టు చూపించారు. 'అఖండ'లో ఏకంగా హీరో బాలకృష్ణ అఘోర పాత్ర చేశారు. పతాక సన్నివేశాల్లో మహా శివుడు వచ్చినట్లు చూపించారు. ఈ మధ్య కాలంలో శివుని నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో 'అఖండ' ది బెస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందువల్ల, ఆ సినిమాతో 'భీమా'ను కంపేర్ చేశారు. బ్లాక్ బస్టర్ సినిమాతో కంపేర్ చేస్తే మంచిదే అన్నట్లు గోపీచంద్ పేర్కొన్నారు. అదీ సంగతి!


'భీమా'లో ఇద్దరు హీరోయిన్లు! అయితే...
'భీమా' చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. 'పంతం' తర్వాత గోపీచంద్ హీరోగా ఆయన నిర్మించిన చిత్రమిది. దీనికి కన్నడ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఎ హర్ష దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది. అయితే... శివ రాజ్ కుమార్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వేద' తెలుగులోనూ మంచి విజయం అందుకుంది.


Also Readఅమ్ము రోల్ పూజా హెగ్డే చేస్తే - 'గుంటూరు కారం' సెట్స్‌లో మహేష్, పూజ ఫోటోలు చూశారా?



'భీమా'లో గోపీచంద్ సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ఒకరు... మాళవిక శర్మ. ఇంకొకరు... ప్రియా భవానీ శంకర్. హీరోతో వాళ్లిద్దరికీ తొలి చిత్రమిది. అయితే... హీరోయిన్లు ఇద్దరికీ కాంబినేషన్‌ సీన్లు లేవు. దీనికి 'కెజియఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభించిందని, నేపథ్య సంగీతం అయితే గూస్‌ బంప్స్ తెప్పిస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ, ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక, ఎడిటర్: తమ్మిరాజు, మాటలు: అజ్జు మహంకాళి, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ - లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవి వర్మ.


Also Read: అమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా... ట్రైలర్ చూసి మెచ్చుకుంది: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ