Vizag News : విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైజాగ్ నుంచే పాలన చేపడతామన్నారు. మళ్లీ గెచిన తర్వాత వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అదే తన కమిట్‌మెంట్ అంటూ కామెంట్ చేశారు.
విశాఖలో విజన్ విశాఖ సదస్సు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఓప్రైవేటు హోటల్‌లో రెండు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. మొదటి రోజు సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ వైజాగ్ వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే వైజాగ్ చాలా త్వరగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు జగన్. స్థిరత్వమైన ప్రభుత్వం ఉందని అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. అదే టైంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. రాష్ట్రానికి విశాఖ చాలా ముఖ్యమైన బ్యాక్ బోన్‌గా ఉండబోతోందని అన్నారు.
భవిష్యత్‌లో హైదరాబాద్ కంటే వైజాగ్ అభివడద్ధి చెందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. విభజనలో భాగంగా హైదరాబాద్ కోల్పోయామని దాని ప్రభావం నేటికీ ఉంటోందన్నారు. ఓవైపు అభివృద్ధిని కొనసాగిస్తూనే ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని కూడా ఉరకలు పెట్టిస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఏపీలో 70 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.
చాలా రంగాల్లో దేశంలోని ఇతర్రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మెరుగైన స్థానంలో ఉందన్నారు సీఎం జగన్. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని వివరించారు. ఇలాంటి వాటన్నింటికీ పోర్టులు, ఇతర రవాణా సౌకర్యుల తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం, పోర్టులు రాష్ట్రాభివృద్ధికి సాయపడుతున్నాయని వివరించారు.