AIASL Recruitment: విశాఖపట్నంలోని ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ - కస్టమర్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్/హ్యాండీ వుమెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్, డిగ్రి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లీషు మాట్లాడటం, రాయటం వచ్చి ఉండాలి. సరైన అర్హతలు ఉన్నవారు పోస్టులని అనుసరించి మార్చి 9, 11వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 0900 నుంచి 1200 గంటల వరకు ఇంటర్వూలు నిర్వహిస్తారు. పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 77 పోస్టులు
⏩ జూనియర్ ఆఫీసర్ - కస్టమర్ సర్వీస్: 05 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి 10+2+3 ప్యాటర్న్‌లో డిగ్రీ లేదా ఎంబీఏ లేదా తత్సమానం, ఏదైనా విభాగంలో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ కోర్సు లేదా 3 సంవత్సరాల పార్ట్ టైమ్ కోర్సుతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. పీసీ వినియోగంలో ప్రావీణ్యం ఉండాలి. హిందీ కాకుండా ఇంగ్లీషులో మాట్లాడటం, రాయటం మంచి కమాండ్ ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.29,760.
⏩ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 22 పోస్టులు
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి 10+2+3 ప్యాటర్న్‌లో డిగ్రీ లేదా ఎయిర్‌లైన్ డిప్లొమా లేదా సర్టిఫైడ్ కోర్సు వంటివి IATA-UFTAA లేదా IATA-FIATA orIATA-DGR లేదా IATA కార్గోలో డిప్లొమాతో పాటు ఎయిర్‌లైన్/GHA/కార్గో/ఎయిర్‌లైన్ టికెటింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పీసీ వినియోగంలో ప్రావీణ్యం ఉండాలి. హిందీ కాకుండా ఇంగ్లీషులో మాట్లాడటం, రాయటం మంచి కమాండ్ ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.24,960.
⏩ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 14 పోస్టులు
అర్హత:గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2, ఎయిర్‌లైన్ డిప్లొమా లేదా సర్టిఫైడ్ కోర్సు వంటివి IATA-UFTAA లేదా IATA-FIATA orIATA-DGR లేదా IATA కార్గోలో డిప్లొమాతో పాటు ఎయిర్‌లైన్/GHA/కార్గో/ఎయిర్‌లైన్ టికెటింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పీసీ వినియోగంలో ప్రావీణ్యం ఉండాలి. హిందీ కాకుండా ఇంగ్లీషులో మాట్లాడటం, రాయటం మంచి కమాండ్ ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.21,270.
⏩ హ్యాండీమ్యాన్/హ్యాండీ వుమెన్: 36 పోస్టులు
అర్హత: ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లాంగ్వేజ్ చదివి అర్థం చేసుకోగలగాలి. స్థానిక మరియు హిందీ భాషలపై పట్టు ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.18,840.
దరఖాస్తు ఫీజు: రూ.500. “AI AIRPORTSERVICES LIMITED.” ముంబయి పేరిట డీడీ తీయాలి. అభ్యర్థుల పూర్తి పేరు & మొబైల్ నంబర్‌ను డిమాండ్ డ్రాఫ్ట్ వెనుకవైపు రాయాలి. ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారమ్‌తో పాటుగా పూరించిన & టెస్టిమోనియల్‌లు/సర్టిఫికేట్‌ల కాపీలు(ఈ నోటిఫికేషన్‌తో జతచేయబడిన దరఖాస్తు ఫార్మాట్‌తో పాటుగా ఇంటర్వ్యూ జరుగు తేదీ, సయయంలో పర్సనల్‌గా అందచేయాలి.
ఎంపిక విధానం:
1. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీస్..
➥ పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
➥ ఎంపిక ప్రక్రియ అదే రోజు లేదా తదుపరి రోజు ఉంటుంది.
2. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/జూ. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్..
➥ పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
➥ ప్రతిస్పందనను బట్టి కంపెనీ తన అభీష్టానుసారం గ్రూప్ డిస్కషన్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఎంపిక ప్రక్రియ అదే రోజు లేదా తదుపరి రోజు ఉంటుంది.
3. హ్యాండీమ్యాన్ / హ్యాండీ వుమెన్..
➥ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ వంటివి). కేవలం ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పంపుతారు.
➥ పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
➥ ఎంపిక ప్రక్రియ అదే రోజు లేదా తదుపరి రోజు ఉంటుంది.
వాక్ ఇన్ వేదిక:
CNS Training Facilityin Technical Building,
VisakhapatnamInternational Airport,
Old Airport CargoTerminal,
Visakhapatnam, Andhra Pradesh- 530009.
వాక్-ఇన్ తేదీ & సమయం:
🔰 జూనియర్ ఆఫీసర్ - కస్టమర్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 09.03.2024(09:30 గంటల నుంచి 12:30 గంటల వరకు)
🔰 హ్యాండీమ్యాన్ / హ్యాండీ వుమెన్: 11.03.2024(09:30 గంటల నుంచి 12:30 గంటల వరకు)