ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, వైసీపీ సీనియర్ లీడర్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 12 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోసాను. పార్టీలో కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యే ,మంత్రిని అయ్యాను. నా వ్యక్తిగత నిర్ణయం మేరకు రాజీనామా చేస్తున్నా. మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నా. చంద్రబాబు సమక్షంలో జైహొ బిసి సభలో టీడీపీలో జాయిన్ అవుతున్నాను. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు పార్టీని వీడుతున్నాను. నేను ఎప్పుడు తప్పు చేయలేదు. నాకు సహకారం లేదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. 


151 గడప ఉన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నేను ఎమ్మెల్యే అయ్యాను. ప్రజల కష్టసుఖాలను చూసి ఈ స్థాయికి వచ్చాను. నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలనే భావించారు. నన్ను 2019లోనే కర్నూలు ఎంపిగా పోటీ చేయాలని చెప్పినా వద్దని ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎంపిగా పోటీ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నా నియోజకవర్గం వదిలి వెళ్లాలని వైసీపీ చెప్పింది. అది నాకు నచ్చలేదు. 


రెండు జిల్లాల్లో పోటీ చేయడానికి టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నేను పుట్టిన ఊరు కావడంతో గుంతకల్ నుంచి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని నేను ఏ రోజు అనుకోలేదు. నేను మాస్ లీడర్‌ని. నాతోపాటు చాలా మందికి న్యాయం జరగలేదు. 14 నియోజకవర్గంలో ఎవరికి ఎక్కడ న్యాయం జరిగిందో చూడండి. కర్నూలు జిల్లాలో ఎస్సీలను, బోయాలను పదవుల నుంచి తప్పించారు. కర్నూలు జిల్లాలో ఒక సామాజిక వర్గాన్నే ఎందుకు తప్పించలేదు. 


నాకు 2022 వరకు జీసస్, అల్లా అన్ని జగన్. జగన్ ఒక విగ్రహలా మారారు మేము ఏమి చెప్పినా వినిపించడం లేదు. జగన్ అనే శిల్పానికి ఇద్దరు పూజారులు చెప్పేది వేదంలా ఉంది. సజ్జల రామ కృష్ణా రెడ్డి, ధనునంజయ్‌ రెడ్డి. ఇద్దరూ కలిసి ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారు. పూజారులు ఇద్దరు కలిసి భక్తులుగా ఉన్న మమ్మల్ని వదిలేసి వారసులను వెనకేసుకొస్తున్నారు. నా పక్క నియోజకవర్గం ఆలూరు అభివృద్ధి చెందలేదు కానీ,  నా పక్క నియోజకవర్గం డోన్ మాత్రం అభివృద్ధి చెందింది. నా నియోజకవర్గం పనులకు సంబంధించి బిల్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ధనుంజయ రెడ్డి వైసీపీ కోసం పని చేస్తున్నారు. నేను మళ్ళీ తిరిగి  వైసీపీకి రాను. నేను అజాత శత్రువును నాకు ఎవరితోనూ శతృత్వం లేదు అనిఅన్నారు.