సీమకు ఛాన్స్!


ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత పలు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత మార్పులు చేయాలనుకుంటోందని ప్రచారం  జరుగుతోంది. ఇలా మార్పులు చేయాలనుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ కూడా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పటికే చర్చనీయాంశమమయింది. ఏపీలో కూడా అధ్యక్షుడి మార్పు అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు. ఆయన పదవి కాలం ముగిసింది. ఆయననే అధ్యక్షుడిగా కొనసాగిస్తామని పార్టీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ గతంలో ప్రకటించారు. నిన్నామొన్నటిదాకా సోము వీర్రాజును తొలగిస్తారన్న ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు.. వచ్చె ఎన్నికల్లో పొత్తుల అంశాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. రాజకీయ సమీకరణఆలు మారాలంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని మార్చాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పూర్తి వివరాలు


 


సజావుగా పరీక్ష


తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్‌ 4 పరీక్ష మొదటి సెషన్ ముగిసింది. 2.30కు రెండో సెషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాలతో పడిన నోటిఫికేషన్‌కు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 9,01,051 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. పూర్తి వివరాలు


 


పొంగులేటి ఎఫెక్ట్


ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున రాజీనామా బాట పట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కనకయ్యతో పాటు ఆయన అనుచరులు, ఇల్లందు నియోజకవర్గవ్యాప్తంగా పలువురు నాయకులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. మొత్తం 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు కారు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరంతా  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.  ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.పూర్తి వివరాలు


 


సోనియా, రాహుల్ వస్తున్నారా?


వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇడుపులపాయకు వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వారి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇడుపులపాయకు  వచ్చారని చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఎనిమిదో తేది. ఇటీవల షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని దానికి సంబంధించిన ప్రకటన ఇడుపులపాయలోనే వస్తుందని చెబుతున్నారు. కానీ ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం అలాంటి సమాచారం ఏమీ మీడియాకు ఇవ్వడం లేదు. అలాంటి కార్యక్రమం ఉన్నట్లుగా ఎలాంటి సమాచారం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు


నాగల్ నుంచి నేరుగా శంషాబాద్‌కు హైవే


హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై నిర్మించిన ఇంటర్‌ ఛేంజ్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై నిర్మించిన 20వ ఇంటర్‌ ఛేంజ్‌ ఇది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై నిర్మించిన 20వ ఇంటరర్‌ఛేంజ్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్‌... దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌ సొంతమని అన్నారు. అలాంటి నగరంలో మణిహారంలా ఓఆర్‌ఆర్‌ ఉందన్నారు. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్‌లతోపాటు, అండర్‌పాస్‌లు నిర్మించామని తెలిపారు. వీటితోపాటు మూసీనదిపపై బ్రిడ్జిలు కూడా నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే 14 వంతెనలకు శంకుస్థాపన చేయబోతున్నట్టు ప్రకటించారు.  పూర్తి వివరాలు