హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై నిర్మించిన ఇంటర్‌ ఛేంజ్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై నిర్మించిన 20వ ఇంటర్‌ ఛేంజ్‌ ఇది. 


ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై నిర్మించిన 20వ ఇంటరర్‌ఛేంజ్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్‌... దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌ సొంతమని అన్నారు. అలాంటి నగరంలో మణిహారంలా ఓఆర్‌ఆర్‌ ఉందన్నారు. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్‌లతోపాటు, అండర్‌పాస్‌లు నిర్మించామని తెలిపారు. వీటితోపాటు మూసీనదిపపై బ్రిడ్జిలు కూడా నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే 14 వంతెనలకు శంకుస్థాపన చేయబోతున్నట్టు ప్రకటించారు. 






మూసీనదిపై నిర్మించే వంతెనల్లో భాగంగా శంషాబాద్‌ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. దీనికి 15వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మరోవైపు మెట్రో విస్తరణ విషయంలో కూడా పనులు ఊపందుకోనున్నాయని తెలిపారు. రెండున్నరేళ్లలో శంషాబాద్‌ వరకు మెట్రో విస్తరణ పూర్తవుతుందన్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి కందుకూరు ఫార్మాసిటీ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.  






హైదరాబాద్‌లో 100 శాతం మురుగునీటి శుద్ధి జరుగుబోతోందన్నారు. కేటీఆర్. దీని కోసం దాదాపు నాలుగు వేల కోటల ఖర్చుతో 31 ఎస్టీపీ ప్లాంట్‌లు నిర్మించబోతున్నట్టు కూడా తెలిపారు. మొదటికి కోకాపేటలో ప్రారంభిస్తన్నట్టు తెలిపారు. సెప్టెంబర్‌ నాటికి అన్నింటినీ ప్రారంభించి దేశంలోనే మొదటి 100 శాతం మురుగునీటి శుద్ధ నగరంగా హైదరాబాద్‌ మారబోతుందన్నారు.