Pan-Aadhar Linking Payment Status : ఆధార్‌తో పాన్ లింక్ చేయడానికి లాస్ట్ డేట్ (2023 జూన్ 30) ముగిసింది. చివరి రోజున, పాన్-ఆధార్ లింక్ కోసం పేమెంట్ చేసినవాళ్లలో కొందరికి ఇబ్బందులు ఎదురైనట్లు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ దృష్టికి వెళ్లింది. డబ్బులు పే చేసిన వాళ్లకు రిలీఫ్ ఇచ్చేలా, ఆదాయపు పన్ను విభాగం కీలక అప్‌డేట్ ఇచ్చింది.
చలాన్ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
ఐటీ డిపార్ట్‌మెంట్ చెబుతున్న ప్రకారం, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి 1000 ఫైన్ కట్టినవాళ్లు ఆ చలాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. మీ పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగిందా, లేదా అని తెలుసుకోవడానికి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక పోర్టల్‌ను విజిట్ చేయాలి.
https://www.incometax.gov.in/iec/foportal/ లింక్ ద్వారా ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లోకి వెళ్లవచ్చు.
ఇక్కడ, మీ ఐడీ (PAN), పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాలి.
ఆ తర్వాత, హోమ్ పేజీలో కనిపించే మెనూ బార్‌లో (ఈ-ఫైల్) e-File కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.
అందులో, మూడో ఆప్షన్‌గా ఈ-పే టాక్స్ (e-Pay Tax) కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే, మీ చెల్లింపు పూర్తయిందా, లేదా? అనేది తెలుసుకోవచ్చు.
పేమెంట్ పూర్తయినట్లు ఈ-పే టాక్స్‌లో కనిపిస్తే పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చని ఐటీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వాస్తవానికి, పాన్-ఆధార్ లింక్ కోసం చలాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తర్వాత పాన్‌కార్డ్ హోల్డర్ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు చలాన్ చెల్లింపునకు సంబంధించిన రిసిప్ట్ కాపీ వస్తుందని ఐటీ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది. ఒకవేళ డబ్బు చెల్లింపు పూర్తయిన తర్వాత ఆధార్-పాన్ లింకింగ్ ప్రాసెస్ పూర్తి కాకపోతే, అలాంటి కేసుల గురించి ఆలోచిస్తామని తన ట్వీట్‌లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
పాన్ కార్డ్‌తో ఆధార్ లింక్ చేయకపోతే ఏంటి నష్టం?
30 జూన్ 2023లోపు పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, సదరు వ్యక్తి పాన్ కార్డ్ నాన్-ఆపరేటివ్‌గా మారుతుంది. అలాంటి పాన్‌తో టాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. పాన్-ఆధార్ లింక్ కాకపోతే, టాక్స్ పేయర్‌కు రిఫండ్ రాదు. పాన్ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అలాగే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ TDS & TCS వసూలు చేస్తారు. అంతేకాదు, పాన్ కార్డ్-ఆధార్ అనుసంధానం కాకపోతే ఆర్థికపరమైన లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంక్ అకౌంట్, డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. పాన్ కార్డ్ అవసరమైన ప్రతి చోట పని ఆగిపోతుంది. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసి, ఫైన్ కట్టిన తర్వాత 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.
పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు, వాటిని అనుసంధానించాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్టం ప్రకారం నాన్ రెసిడెంట్‌లు, భారతీయ పౌరులు కాని వాళ్లు, గత సంవత్సరం నాటికి 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.
మరో ఆసక్తికర కథనం: ఈ నెలలోనూ 'బండ' భారం భరించాల్సిందే - వంట గ్యాస్ కొత్త రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial