ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి, ఎడమ కంటిపైన గాయం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిపై ఓ గుర్తుతెలియని ఆగంతకుడు రాయితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్ర (YS Jagan Bus Yatra) చేస్తున్నారని తెలిసిందే. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సీఎం జగన్ పై రాయి విసిరాడు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి పైన గాయమైంది. ఇంకా చదవండి


వైఎస్ జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పై జరిగిన రాళ్లదాడిని వైసీపీ నేతలతో పాటు తెలంగాణకు చెందిన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర (YS Jagan Bus Yatra) నిర్వహిస్తుండగా.. సింగ్‌నగర్‌ వద్దకు రాగానే ఓ ఆగంతకుడు రాయి విసరగా ఎడమ కంటి మీద గాయమైంది. ఆగంతకుడి రాయి దాడిలో గాయపడిన ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ బీఆర్ఎస్ నేతలు నైతిక మద్దతు తెలుపుతున్నారు. ఇంకా చదవండి


ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాల ఆధిపత్యం


రాజకీయాల్లో బలం , బలగాన్ని కుటుంబాల ద్వారానే కూడగట్టుకున్న నేతలు ఉన్నారు. ఇలాంటి నేతలు ఏపీలో కాస్త ఎక్కువగా ఉన్నారు  ఒక్కో కుటుంబం నుంచి నలుగురు, ఐదుగురు పోటీ చేస్తున్నారు. విచిత్రం ఏమటంటే..  వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. పార్టీలు చేతుల్లో ఉన్న కుటుంబాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇంకా చదవండి


పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ పేరుతో 26 కోట్ల ఫ్రాడ్


ఇంటి నుంచి పని చేస్తే చాలు. రోజుకు గంట కష్టపడితే.. వేలల్లో సంపాదించుకోవచ్చు. విద్యార్థులు, గృహిణిలు... అందరూ అర్హులే. కంప్యూటర్‌, మొబైల్‌ ఉంటే చాలు. ఎక్కడి నుంచి అయినా పనిచేసుకోవచ్చు. విద్యార్హతలు పెద్దగా అవసరం లేదు.  తాము పంపే వీడియోలకు లైక్‌లు ఇవ్వడం... రివ్యూలు రాయడం చేస్తే చాలు. ఇలాంటి మెసేజ్‌లు మీకూ వస్తున్నాయా...? ఒక్కసారి ట్రై చేస్తే తప్పేముంది... అదనపు ఆదాయం వస్తుంది. ఇంకా చదవండి


బోర్న్‌విటాతో చిన్నారులకు ముప్పు


బోర్న్‌విటా (Bournvita) కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈకామర్స్ కంపెనీలు బోర్న్‌విటాని హెల్త్ డ్రింక్స్ కేటగిరీలో నుంచి తొలగించాలని తేల్చి చెప్పింది. పోర్టల్స్ నుంచి వెంటనే తీసేయాలని ఆదేశించింది. బోర్న్‌విటాతో పాటు ఇతర డ్రింక్స్‌ని కూడా తొలగించాలని స్పష్టం చేసింది. వాటిని హెల్తీ డ్రింక్స్‌గా పరిగణించలేమని వెల్లడించింది. ఆహార భద్రతా ప్రమాణ సంస్థ ప్రకారం హెల్త్ డ్రింక్‌కి ఎలాంటి నిర్వచనం లేదని, అలాంటప్పుడు కొన్ని డ్రింక్స్‌ని ఆ ట్యాగ్ తగిలించి ఆ కేటగిరీలో ఎలా ఉంచుతారని ప్రశ్నించింది. ఏప్రిల్ 10వ తేదీనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. National Commission for Protection of Child Rights ఇలా అప్రమత్తం చేసింది. బోర్న్‌విటాలో షుగర్ లెవెల్స్ పరిమితికి మించి ఉన్నాయని వెల్లడించింది. Food Safety and Standards Authority of India (FSSAI) వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రమాణాలకు తగ్గట్టుగా లేని డ్రింక్స్‌ని హెల్త్ డ్రింక్స్‌గా ప్రమోట్ చేయాడన్ని ఖండించింది. ఇంకా చదవండి


బెంగళూరు పేలుడు కేసు ప్రధాన సూత్రధారి బెంగాల్‌లో అరెస్ట్


బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారిని NIA బెంగాల్‌లో అరెస్ట్ చేసింది. ఈ పేలుడు తరవాత పరారీలో ఉన్న నిందితుడు కోల్‌కత్తాలో తలదాచుకున్నట్టు గుర్తించారు. అరెస్ట్ అయిన ముసావిర్ హుస్సేన్ కేఫ్‌లో బాంబు పెట్టినట్టు NIA స్పష్టం చేసింది. ఇంకా చదవండి


టీసీఎస్ లాభం రూ.12,434 కోట్లు, డివిడెండ్‌ 28 రూపాయలు


దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) 2023-24 మార్చి త్రైమాసికంలో రూ. 12,434 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం, 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 11,392 కోట్ల లాభాన్ని మిగుల్చుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే నెట్‌ ప్రాఫిట్‌ ఇప్పుడు 9 శాతం పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 45,908 కోట్ల నికర లాభాన్ని ఈ టెక్‌ దిగ్గజం ఆర్జించింది. ఇంకా చదవండి


తరుణ్ అందుకే సినిమాలు చేయడం లేదు, మోహన్ బాబు ఫ్యామిలీ కూడా కష్టపడుతోంది: ఎంఎస్ నారాయణ కొడుకు విక్ర‌మ్


ఎంఎస్ నారాయ‌ణ‌.. తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీలో గొప్ప హాస్య న‌టుడు. ఎంతోమందిని త‌న యాక్టింగ్ తో క‌డుపుబ్బా న‌వ్వించారు ఆయ‌న‌. ఆయ‌న మ‌న మ‌ధ్య‌లో లేక‌పోయినా ఆయ‌న చేసిన కామెడీని మాత్రం ఎవ్వ‌రూ మ‌ర్చిపోరు. కానీ, ఆయ‌న వార‌సులు ఎవ్వ‌రూ ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీలో లేరు. దానిపై స్పందించారు ఆయ‌న కొడుకు విక్ర‌మ్. రీసెంట్ గా ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్నో విష‌యాల గురించి చెప్పారు. టాలెంట్ లేక ఎవ్వ‌రూ సినిమాల‌కు దూరం అవ్వ‌ర‌ని, క‌లిసిరాకే దూరంగా వెళ్తార‌ని అన్నారు. కొడుకు సినిమా త‌ర్వాత త‌ను మ‌ళ్లీ ఎందుకు సినిమాలు చేయ‌లేదో? త‌రుణ్ లాంటి వాళ్లు సినిమాల‌కు ఎందుకు దూరం అయ్యారో చెప్పుకొచ్చారు విక్ర‌మ్. ఇంకా చదవండి


ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు, వారిది కూడా - డాక్టరేట్‌ అనంతరం చరణ్‌ కామెంట్స్‌


మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ తాజాగా గౌరవ డాక్టరేట్‌ అందుకున్నాడు. ఈ రోజు చెన్నైలో వేల్స్‌ యూనివర్సిటీలో జరిగిన 14వ వార్సికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ అందించింది. సినీరంగంలో, ఎంటర్‌ప్రెన్యూరర్‌గా ఆయన అందించిన సేవలకు గాను లిటరేచర్‌లో డాక్టరేట్‌ను ప్రదానం చేసింది వేల్స్‌. ఇంకా చదవండి


IPL 2024: లో స్కోరింగ్‌‌లో హై టెన్షన్‌, గెలుపు రాజస్థాన్‌దే


పంజాబ్‌(PBKS)తో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్(RR) విజయం సాధించింది. ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో చివరి వరకూ విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. పిచ్‌ బౌలర్లకు అనుకూలించిన వేళ.. ప్రతీ పరుగుకు ఇరు జట్లు శ్రమించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్‌  ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బ్యాటర్లలో అషుతోష్‌ శర్మ ఒక్కడే 30 పరుగుల మార్క్‌ను దాటాడు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌... చివరి ఓవర్‌లో విజయం సాధించింది. ఇంకా చదవండి